CSK Squad Changes 2026: ఐపీఎల్ 19వ సీజన్ కీలక దశకు చేరుకున్న వేళ, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ పేస్ విభాగంలో మార్పులు చేసింది.
ఇంగ్లాండ్ పేసర్ జేమీ ఓవర్టన్ గాయపడటంతో, అతని స్థానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆల్‌రౌండర్ డియాన్ ఫొరెస్టర్ (Dian Forrester) తో భర్తీ చేసింది.
Read Also: Mumbai Indians Captaincy: ముంబయి ఇండియన్స్ కొత్త కెప్టెన్ మార్పుపై ఉత్కంఠ!
రూ. 75 లక్షల ఒప్పందం
డియాన్ ఫొరెస్టర్‌ను రూ. 75 లక్షలకు సీఎస్కే దక్కించుకుంది.ఎడమచేతి వాటం పేసర్ అయిన డియాన్, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించగలడు.ఇటీవల జరిగిన వివిధ టీ20 లీగ్స్‌లో బంతితోనూ, బ్యాటుతోనూ అద్భుత ప్రదర్శన చేయడంతో సీఎస్కే మేనేజ్‌మెంట్ అతనిపై మొగ్గు చూపింది.
CSK Squad Changes 2026:ప్లే ఆఫ్స్ లక్ష్యంగా..
సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-4 రేసులో నిలవడానికి ప్రయత్నిస్తోంది. జేమీ ఓవర్టన్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు దూరం కావడం జట్టుకు లోటే అయినా, ఫొరెస్టర్ తన వేగంతో డెత్ ఓవర్లలో కీలకం అవుతాడని జట్టు భావిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
మైదానంలో కోహ్లీ 'పెద్ద మనసు'కు ఫ్యాన్స్ ఫిదా

