Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CSK పై లక్నో విజయం: మ్యాచ్ అనంతరం కెప్టెన్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

CSK పై లక్నో విజయం: మ్యాచ్ అనంతరం కెప్టెన్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

వార్త 1 week ago

Rishabh Pant: చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పై లక్నో సూపర్ జయంట్స్ (LSG) ఘనవిజయం సాధించిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ రిషభ్ పంత్ మ్యాచ్ హైలైట్స్, జట్టు వ్యూహాలపై స్పందించారు.ఈ సందర్భంగా కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ..

“గెలవడం ఎప్పుడూ మంచి అనుభూతినిస్తుంది. మేము ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔటైనప్పటికీ.. ఆడే ప్రతి మ్యాచ్‌కు విలువ ఉంటుందని టాస్‌కు ముందే జట్టుతో చర్చించుకున్నాం. ఈ పద్ధతిలో నిలకడగా క్రికెట్ ఆడటాన్ని మేము గర్వంగా భావిస్తాం” అని అన్నారు.

Read Also:Ruturaj Gaikwad: ఈరోజు మాకు కలిసి రాలేదు.. కానీ బలంగా పుంజుకుంటాం: రుతురాజ్ గైక్వాడ్

ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన యువ పేసర్ ఆకాష్ సింగ్‌ను పంత్ ప్రత్యేకంగా కొనియాడారు. “ఆకాష్ ఈ ఐపీఎల్ అంతా చాలా కష్టపడుతున్నాడు. అందరికీ ప్రతి మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం సాధ్యపడదు, కానీ అతను తన ప్రాక్టీస్‌ను ఎప్పుడూ ఆపలేదు. ప్లాన్‌కు కట్టుబడి బౌలింగ్ చేయడంలో అతను దిట్ట. సుదీర్ఘ సమయం పాటు తన లైన్ అండ్ లెంగ్త్ మార్చకుండా బౌలింగ్ చేయడం వల్లే అతనికి వికెట్లు దక్కాయి. అతని హార్డ్ వర్క్ ఫలించడం చూడటం ఆనందంగా ఉంది” అని పంత్ వివరించారు.

 LSG vs CSK IPL 2026 Results, Rishabh Pant

Rishabh Pant: టాప్ ఆర్డర్ వ్యూహం ఫలించింది

జట్టు బ్యాటింగ్ లైనప్ గురించి వివరిస్తూ.. “ఇద్దరు విదేశీ ఆటగాళ్లను ఓపెనింగ్‌కు పంపడం, నికోలస్ పూరన్‌ను మూడో స్థానంలో ఆడించడం మా ముందస్తు ప్రణాళిక. హోమ్ గ్రౌండ్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం మాకు బాగా కలిసొచ్చింది. అయితే అతిగా వ్యూహాల మీద ఆధారపడటం కూడా కొన్నిసార్లు నష్టాన్ని కలిగిస్తుంది” అని పంత్ విశ్లేషించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

3 1 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ డౌన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha