Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈరోజు మాకు కలిసి రాలేదు.. కానీ బలంగా పుంజుకుంటాం: రుతురాజ్ గైక్వాడ్

ఈరోజు మాకు కలిసి రాలేదు.. కానీ బలంగా పుంజుకుంటాం: రుతురాజ్ గైక్వాడ్

వార్త 1 week ago

Ruturaj Gaikwad: ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పరాజయం పాలైంది.

ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషిస్తూ, జట్టు ప్రదర్శనపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.పిచ్ పరిస్థితులపై రుతురాజ్ స్పందిస్తూ బ్యాటింగ్ విభాగాన్ని సమర్థించారు.లక్నో పిచ్‌పై హార్డ్ లెంగ్త్ బంతులను ఎదుర్కోవడం ప్రారంభంలో కష్టంగా అనిపించిందని, లక్నో బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారని చెప్పారు.”మేము ఈ పిచ్‌పై 160 నుండి 170 పరుగులు వస్తాయని ఆశించాం, కానీ 187 పరుగులు సాధించగలిగాం. బ్యాటింగ్‌ పరంగా మా ఆటగాళ్లు చేయగలిగినంత చేశారు” అని రుతురాజ్ పేర్కొన్నారు.

Read Also:Chennai First Wicket Down:3 1 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ డౌన్

Ruturaj Gaikwad: లక్నో ఓపెనర్ల విధ్వంసం.. ఎగ్జిక్యూషన్ లోపం

లక్నో బ్యాటర్లు అసాధారణమైన షాట్లతో మ్యాచ్‌ను లాగేసుకున్నారని రుతురాజ్ అంగీకరించారు.”మిచెల్ మార్ష్ షార్ట్ బాల్స్ బాగా ఆడతాడు. అందుకే టెస్ట్ మ్యాచ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేసి కట్టడి చేయాలనుకున్నాం. కానీ అతను అద్భుతంగా ఆడాడు.”కీలక సమయాల్లో బౌలింగ్ ఎగ్జిక్యూషన్ లోపించిందని, కొన్ని లూజ్ బాల్స్ వేయడం వల్ల లక్నో ఓపెనర్లు తమకు కోలుకునే అవకాశం ఇవ్వలేదని విశ్లేషించారు.లక్నో మ్యాచ్‌లో ఓడిపోవడంతో సీఎస్‌కే ప్లేఆఫ్స్ సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి.

 Ruturaj Gaikwad Post Match Interview, CSK vs LSG

మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. దీనిపై రుతురాజ్ మాట్లాడుతూ.. ముందుగా తాము చెన్నైకి చేరుకోవాలన్నాడు. అది సుదీర్ఘ ప్రయాణం. ఆ తరువాత తాము ఎక్కడ మెరుగు అవ్వాలో అనే అంశంపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చాడు. ఇకపై తాము ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సి ఉందన్నాడు. దీనిపై పెద్దగా ఆలోచించాల్సిన పని లేదన్నాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడి తమకు కలిసొచ్చే రోజున అద్భుతంగా రాణించి ఫలితాలను అనుకూలంగా మార్చుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశాడు. తాము బలంగా పుంజుకుంటామన్నాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

నేడే కేకేఆర్ vs గుజరాత్ టైటాన్స్ 'డూ ఆర్ డై' మ్యాచ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha