IPL 2026 Season: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ప్రస్థానం నిరాశగా ముగిసింది. గురువారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో చెన్నై 89 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
ఈ పరాజయంతో సీఎస్‌కే, ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరకుండానే టోర్నమెంట్ నుంచి అధికారికంగా నిష్క్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ చేజారడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టుకు భారీ జరిమానా పడటం చెన్నై సూపర్ కింగ్స్‌కు కోలుకోలేని మరో పెద్ద దెబ్బగా మారింది.
Read Also : GT vs CSK IPL: గుజరాత్ ఘన విజయం.. CSK 140 పరుగులకే ఆలౌట్!
Big shock for CSK.. Team fined for slow over rate!
జట్టు సభ్యులకు కూడా తప్పని జరిమానా
IPL 2026 Season: ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 230 పరుగుల తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలోనే తీవ్ర కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గోల్డెన్ డక్ కావడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. మిడిల్ ఓవర్లలో శివమ్ దూబే కేవలం 17 బంతుల్లోనే 47 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆశలు రేపినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుంచి సరైన సహకారం అందలేదు. ఫలితంగా చెన్నై భారీ తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి తప్పుకుంది.
మ్యాచ్ ముగిసిన తరవాత ఐపీఎల్ పాలక మండలి సీఎస్‌కే జట్టుపై కఠిన చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయకపోవడంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు రూ. 24 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఇలాంటి తప్పిదానికి పాల్పడటం ఇది రెండోసారి కావడంతో కెప్టెన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా తుది జట్టులో ఉన్న మిగతా ఆటగాళ్లందరికీ తలా రూ. 6 లక్షలు వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com

