Iran warning to Israel after attacks: పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. దక్షిణ ఇరాన్ ప్రాంతంలో అమెరికా దళాలు జరిపిన తాజా సైనిక దాడులు ప్రాంతీయ శాంతిని అస్థిరపరిచాయి.
ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఇరాన్ నూతన సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ అమెరికా.. ఇజ్రాయెల్ దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అటు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య తెరవెనుక బిలియన్ల డాలర్ల నిధుల విడుదల కోసం దౌత్యపరమైన చర్చలు సాగుతుండటం గమనార్హం. ఇరాన్ (Iran) సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మంగళవారం తన అధికారిక టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా అంతర్జాతీయ సమాజానికి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
Read Also: Iran begins restoring internet: సుదీర్ఘ అంతరాయం తర్వాత ఇంటర్నెట్‌ను పునరుద్ధరించిన ఇరాన్
Iran warning to Israel after attacks
ఇజ్రాయెల్ ఒక “క్యాన్సర్ కణితి”: మొజ్తాబా ఖమేనీ
పశ్చిమ ఆసియాలో ఇకపై అమెరికా ఆటలు సాగవని, ఈ ప్రాంతంలోని ముస్లిం దేశాలు ఏవీ అమెరికా సైనిక స్థావరాలకు రక్షణ కవచాలుగా నిలబడవని ఆయన తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో అధికార సమతుల్యత వాషింగ్టన్ చేతుల్లో నుండి చేజారి, ఇరాన్ మద్దతు ఉన్న “రెసిస్టెన్స్ ఫ్రంట్” (ప్రతిఘటన కూటమి) వైపు మలుపు తిరిగిందని ఆయన విశ్లేషించారు. ఇజ్రాయెల్‌ను ఒక “క్యాన్సర్ కణితి”గా అభివర్ణించిన మొజ్తాబా ఖమేనీ.. ఆ దేశాన్ని భూమ్మీద లేకుండా కూకటివేళ్లతో పెకిలించడం ఖాయమని, అది తన శాపగ్రస్త జీవితపు చివరి దశకు చేరుకుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరాన్ దివంగత నేత అలీ ఖమేనీ కూడా ఇజ్రాయెల్ మరో పాతికేళ్లు మనుగడ సాగించలేదని అన్న విషయాలను ఈ సందర్భంగా నిపుణులు గుర్తుచేస్తున్నారు.
Iran warning to Israel after attacks: ఇరాన్ ఓడరేవు నగరం ‘బందర్ అబ్బాస్’ సమీపంలో భారీ పేలుళ్లు
దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్‌గాన్ ప్రావిన్స్ పరిధిలో Iran దళాలు నౌకాదళ మందుపాతరలు (Naval Mines), క్షిపణి ప్రయోగ స్థావరాలను ఏర్పాటు చేస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా సైన్యం అక్కడ ఉన్నపళంగా దాడులకు తెగబడింది. మంగళవారం తెల్లవారుజామున ఇరాన్ వ్యూహాత్మక ఓడరేవు నగరం ‘బందర్ అబ్బాస్’ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా ధృవీకరించింది. గత 48 గంటలుగా అమెరికా చేస్తున్న ఈ “దురాక్రమణ చర్యలు” ఉభయ దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఘోరంగా ఉల్లంఘించడమేనని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది.
Read Also hindi news: hindi.vaartha.com

