Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సింధు జలాల ఒప్పందం పై భారత్ కు పాక్ విజ్ఞప్తి

సింధు జలాల ఒప్పందం పై భారత్ కు పాక్ విజ్ఞప్తి

వార్త 3 months ago

Sindhu Water Issue : దశాబ్దాల నాటి అంతర్జాతీయ జలాల పంపిణీ వ్యవహారం మరోసారి అంతర్జాతీయ వేదికపై హాట్ టాపిక్‌గా మారింది. 1960లో కుదిరిన చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) భారత్ యథాతథంగా గౌరవించాలని పాకిస్తాన్ పట్టుబడుతోంది.

తజికిస్థాన్‌ వేదికగా జరిగిన అంతర్జాతీయ జల సదస్సులో పాక్ పెట్రోలియం, నీటి వనరుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ ఈ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తారు. ఉమ్మడి జల వనరుల పంపిణీ వ్యవహారాన్ని భారత్ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ భారత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.. అది పాకిస్తాన్‌లోని దిగువ ప్రాంతాల నీటి భద్రతను దెబ్బతీయడమే కాకుండా, అక్కడి వ్యవసాయం, ఆహార ఉత్పత్తి రంగాలపై కోలుకోలేని దెబ్బ తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భౌగోళిక రాజకీయాల ప్రమేయం లేకుండా ఒప్పంద నిబంధనల ప్రకారమే నీటిని విడుదల చేయాలని పాక్ అంతర్జాతీయ సమాజం ముందు విజ్ఞప్తి చేసింది.

Read Also : తాజ్ మహల్ సందర్శనపై రూబియోను విమర్శించిన ఇరాన్

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యం – భారత్ దూకుడుతో పాక్ ఉక్కిరిబిక్కిరి

సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్ వ్యూహాత్మకంగా అడుగులు వేయడమే ఈ తాజా వివాదానికి అసలు కారణం. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఘోర ఉగ్రదాడి తర్వాత పాక్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్.. సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. “రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు” అనే కఠినమైన నిశ్చయంతో, నదీ జలాలపై తనకున్న హక్కులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సిద్ధమైంది. నదీ ప్రవాహాలపై ప్రాజెక్టుల నిర్మాణం, నీటి మళ్లింపు వంటి చర్యలతో భారత్ ముందడుగు వేయడంతో, పాకిస్తాన్‌లో నీటి ఎద్దడి ముప్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే, భారత్ కనుక ఒప్పందాన్ని రద్దు చేస్తే తమ దేశం తీవ్ర సంక్షోభంలో పడుతుందనే భయంతో పాక్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై మొరపెట్టుకుంటోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇండో-పసిఫిక్ భద్రత కోసం క్వాడ్ కూటమి వేదికగా జైశంకర్ పిలుపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha