Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డాక్టర్  వృత్తికే మచ్చ..మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం!

డాక్టర్ వృత్తికే మచ్చ..మత్తు మందు ఇచ్చి యువతిపై అత్యాచారం!

వార్త 3 months ago

Lucknow Tejas Hospital Case: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో వైద్యో నారాయణో హరి అనే నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. హాస్పిటల్‌లో చికిత్స కోసం చేరిన ఒక యువతిపై ఆపరేషన్ థియేటర్ (OT) లోనే మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడైన డాక్టర్‌ను అరెస్ట్ చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం సదరు ప్రైవేట్ ఆసుపత్రిని పూర్తిగా సీల్ చేయించింది.

Read Also:Postpartum Mother Deaths Medak:నెల రోజుల బాలింతలైన వదిన, మరదలు వరుస మృతి!

ఆపరేషన్ థియేటర్‌లో అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. లక్నోలోని బక్షి కా తాలాబ్ పరిధిలోని ఇందౌరాబాగ్ ప్రాంతంలో ‘తేజస్ హాస్పిటల్’ అనే ప్రైవేట్ ఆసుపత్రి నడుస్తోంది. ఈ ఆసుపత్రిని విజయ్ కుమార్ గిరి అనే ఆయుర్వేద (BAMS) డాక్టర్ అద్దె భవనంలో నడుపుతున్నాడు. కాగా, ఓ 20 ఏళ్ల దళిత విద్యార్థిని (క్లాస్ 12) తీవ్ర జ్వరం, ఫిట్స్ (Epilepsy) సమస్యలతో మే 19న ఈ ఆసుపత్రిలో చేరింది.

మే 21 (గురువారం) మధ్యాహ్నం సమయంలో ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న డాక్టర్ విజయ్ గిరి, ఆమెకు ఆక్సిజన్ అందించాలనే నెపంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించాడు. ఆ సమయంలో బాధితురాలి సోదరి, ఒక మహిళా నర్సు కూడా లోపలికి వెళ్లగా.. డాక్టర్ వారిద్దరినీ కాసేపు బయట వేచి ఉండాలని చెప్పి పంపించేశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న యువతికి సెలైన్ పెట్టే క్యాన్యులా ద్వారా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయాక ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. కాసేపటి తర్వాత పాక్షికంగా స్పృహలోకి వచ్చిన బాధితురాలు గట్టిగా ఏడుస్తూ ఓటీ నుంచి బయటకు వచ్చి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పింది.

Lucknow Tejas Hospital Case: యోగి ప్రభుత్వం సీరియస్ యాక్షన్:

బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడు విజయ్ కుమార్ గిరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఎస్సీ (SC) సామాజిక వర్గానికి చెందినందున నిందితుడిపై రేప్ కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు నిందితుడి బట్టలను కూడా ఆధారాలుగా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసుపై ఆయన స్పందిస్తూ..: “యూపీ ప్రభుత్వం బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా ఉంటుంది. నిందితుడైన డాక్టర్‌కు కఠినాతి కఠినమైన శిక్ష పడేలా చూస్తాం. తేజస్ హాస్పిటల్‌ను తక్షణమే సీల్ చేయాలని ఆదేశించాం. అలాగే నిందితుడి మెడికల్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో పాటు, అతడు భవిష్యత్తులో మరెక్కడా వైద్యం చేయకుండా ఆయుర్వేద డిపార్ట్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసి అతని డిగ్రీని కూడా స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశాం.” అని ఎక్స్‌లో పేర్కొన్నారు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ట్విషా శర్మ మరణానికి ముందు ఆమె సందర్శనపై సెలూన్ యజమాని సంచలన ఆరోపణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha