Dr Priyanka Funeral: రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూసిన జూనియర్ డాక్టర్ ప్రియాంక అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు.
ఆమె స్వగ్రామమైన జోగులాంబ గద్వాల జిల్లా, ఐజ మండలం ఏక్లాస్‌పూర్ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెకు తుది వీడ్కోలు పలకనున్నారు. హైదరాబాద్‌లో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ప్రియాంక భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం నాటికి ఏక్లాస్‌పూర్ చేరుకోనున్న ప్రియాంక పార్థివదేహానికి గ్రామంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
Read Also:Dr Priyanka Case: ప్రియాంక కేసులో చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ ఘాటు వ్యాఖ్యలు!
Dr Priyanka Funeral: కష్టపడి చదివి డాక్టర్‌గా ఎదిగి.. ఘోర ప్రమాదానికి బలై

- విద్యాభ్యాసం & నేపథ్యం:ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక రెండో తరగతి వరకు ఐజలోనే చదువుకున్నారు. అనంతరం పిల్లల మెరుగైన చదువుల కోసం ఆమె తల్లిదండ్రులు కర్నూలుకు మకాం మార్చారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణించిన ప్రియాంక, కుటుంబంలో పెద్ద కుమార్తె కావడంతో కష్టపడి చదివి ఎంబీబీఎస్ (MBBS) పూర్తి చేశారు.
- ప్రస్తుతం పీజీ విద్యార్థిని:ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జిఎస్ఎల్ (GSL) మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
- ఘోర దుర్ఘటన:రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద సినిమా చూసి వస్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని తీవ్రంగా ఢీకొట్టారు.
- ఆసుపత్రిలో కన్నుమూత:ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రియాంకను సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించగా, సుమారు ఏడు రోజుల పాటు చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రాణాలు కోల్పోయారు.
భవిష్యత్తులో ఎంతోమందికి వైద్యం అందించాల్సిన ఒక యువ వైద్యురాలు ఇలా అనంత లోకాలకు వెళ్లడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది.
Epaper: epaper.vaartha.com

