Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'డార్క్ ప్యాటర్న్స్' వినియోగంపై 9 డిజిటల్ సంస్థలకు కేంద్రం జరిమానా

'డార్క్ ప్యాటర్న్స్' వినియోగంపై 9 డిజిటల్ సంస్థలకు కేంద్రం జరిమానా

వార్త 18 hrs ago

CCPA Action: డిజిటల్ వేదికలపై వినియోగదారులను తప్పుదోవ పట్టించి అదనపు రుసుములు వసూలు చేస్తున్న 'డార్క్ ప్యాటర్న్స్' విధానాలపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (CCPA) ఉక్కుపాదం మోపింది.

నిబంధనలను ఉల్లంఘించిన తొమ్మిది ప్రముఖ డిజిటల్ సంస్థలకు సుమారు రూ.20 లక్షల జరిమానా విధించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది.

Read Also : Tarun Tejpal: తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారించిన బాంబే హైకోర్టు

 Center fines 9 digital companies for using ‘dark patterns’

యాప్ లేదా వెబ్‌సైట్ డిజైన్‌ను మోసపూరితంగా రూపొందించి, వినియోగదారులకు అవసరం లేని సేవలను ఎంచుకునేలా లేదా కొనుగోలు చేసేలా ఒత్తిడి తీసుకురావడాన్నే ‘డార్క్ ప్యాటర్న్స్’ అని వ్యవహరిస్తారు. ఈ విచారణలో క్విక్ కామర్స్ దిగ్గజం ‘జెప్టో మార్కెట్‌ప్లేస్’ అత్యధికంగా రూ.7 లక్షల జరిమానాను ఎదుర్కొంది. బిల్లింగ్ చివరి క్షణంలో అదనపు హ్యాండ్లింగ్ చార్జీలను చేర్చడం, కొనుగోలుదారుకు తెలియకుండానే కార్ట్‌లో సభ్యత్వ రుసుములను జోడించడం (బాస్కెట్ స్నీకింగ్) వంటి విధానాలను పాటించినందుకు సీసీపీఏ ఈ చర్యలు తీసుకుంది. కాగా, సీసీపీఏ ఆదేశాలతో జెప్టో ఈ సేవల్లో మార్పులు చేసింది. మరోవైపు, ఫౌండేషన్ విరాళం రూ.10 ఆటోమేటిక్‌గా ఎంపికయ్యేలా చేయడం, ఉచిత కోర్సుల కోసం వ్యక్తిగత వివరాలను తప్పనిసరి చేయడంతో ఎడ్‌టెక్ సంస్థ ‘ఫిజిక్స్ వాలా’కు రూ.5 లక్షల జరిమానా విధించారు.

CCPA Action: బుక్‌మైషో, ఇండిగో డిజైన్లలో మార్పులు

టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘బుక్‌మైషో’ తమ చారిటీ కోసం రూ.1 విరాళాన్ని ముందే టిక్ చేసి ఉంచడాన్ని నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి, ఆ రకమైన ఎంపికను వెంటనే తొలగించాలని ఆదేశించారు. విమానయాన సంస్థ ‘ఇండిగో’ తన యాప్‌లో అదనపు రక్షణ లేదా సేవలను నిరాకరించినప్పుడు, “లేదు, నేను రిస్క్ తీసుకుంటాను” అనే సందేశం చూపించి ప్రయాణికులను భయాందోళనకు గురిచేసే ‘కన్ఫర్మ్ షేమింగ్’ విధానాన్ని అమలు చేసింది. సీసీపీఏ జోక్యంతో ఇండిగో ఈ వాక్యాన్ని మార్చింది.

ఇతర సంస్థలపై చర్యలు, నిబంధనలు

దాచిన చార్జీలు, బలవంతపు సబ్‌స్క్రిప్షన్‌లు, మోసపూరిత సందేశాల కారణంగా ఫస్ట్‌క్రైకి రూ.2 లక్షలు, అనూజ్ జిందాల్ సంస్థకు రూ.3 లక్షలు, అలాగే ఫార్మ్ఈజీ, మెకాఫీ, స్పైస్‌జెట్‌లకు ఒక్కొక్కదానికి రూ.1 లక్ష చొప్పున జరిమానాలు పడ్డాయి. ప్రభుత్వం 2023లో ప్రవేశపెట్టిన ‘డార్క్ ప్యాటర్న్స్ నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 13 రకాల మోసపూరిత డిజైన్లను స్పష్టంగా నిషేధించాయి. సీసీపీఏ చర్యల ఫలితంగా అనేక సంస్థలు తమ వెబ్‌సైట్లు, యాప్‌లలోని లోపాలను సవరించుకున్నాయని ప్రభుత్వం తెలియజేసింది.

తెలంగాణ లో ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha