Dailyhunt
డబుల్ రిజిస్ట్రేషన్ దందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

డబుల్ రిజిస్ట్రేషన్ దందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు

వార్త 2 weeks ago

TDP Grievance Complaints: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన విజయలక్ష్మి నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో ఆర్ట్ ఇచ్చి అభ్యర్థిస్తూ..

ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామం సర్వే నెం. 286/1, 273లో గల 39వ నంబర్ ప్లాట్ తన పేరు మీద ఉంది. దీనికి సంబంధించిన అసలు పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు అన్నీతన వన్డే ఉన్నాయి. సదరు ప్లాటును కొందరు వ్యక్తులు అక్రమంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రస్తుతం ఆ ప్లాటులో తనని అడుగు పెట్టనివ్వ కుండా అడ్డుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం స్టేషన్లో స్పెషల్ బ్రాంచ్ పిఎస్ఐగా పనిచేస్తున్న వెండటేశ్వరరావు అనే వ్యక్తి ఈ అక్రమణలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. నేను స్పెషల్ బ్రాండ్ ఏఎస్ఐని, నీ ప్లాటులోకి వస్తే ఖబర్దార్ అంటూ తన అధికార బలంతో బెదిరిస్తున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఆర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

Read Also : Chandrababu Naidu: రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు

 Double registration scam in grievances held at TDP central office

TDP Grievance Complaints: అమెరికా ఆశ చూపి నిలువునా ముంచిన ఎన్నారై భర్త

తిరుపతికి చెందిన కె.ప్రవీణ గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి విజప్తి వేస్తూ అమెరికాలో సీనియర్ అప్లికేషన్ డెవలపర్ గా పనిచేస్తున్న తిరుమలశెట్టి జగదీష్ 10-11-2024న వివాహం జరిగింది. పెళ్లయిన 20 రోజులకే భర్త 32సవర్ల బంగారం, పెళ్లి కానుకలు తీసుకుని, వీసా పంపిస్తానని నమ్మించి అమెరికా వెళ్లిపోయాడు. భర్త ఫోన్ కాల్స్ తగ్గించి, తన తండ్రి ఆస్తిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేస్తేనే కాపురానికి తీసుకెళ్లానని కండిషన్ పెట్టడం. అత్త సుధా లక్ష్మి, మామ మోహన్ కుమార్, అడ పడుచు లావణ్యలు ఇంట్లో నుండి గెంటివేయడం, దిశా పోలీస్ స్టేషన్ రైటర్ (మునిరాజా) నిండితులకు కొమ్ముకాస్తూ తాన తాను ఇచ్చిన ఫిర్యాదును మార్చి, షెక్షన్లు తగ్గించి కేసు నమోదు చేశారు. నిందితులు నుండి తన తండ్రికి ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులు వస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోలేడు. వారిపై చర్యలు తీసుకోని, తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.

అధికారుల నిర్లక్ష్యంపై వినతులు

మార్కాపురం జిల్లా పామూరు మండలం చట్టుబడుగు గ్రామానికి చెందిన కుందూరు నాగకేషు గ్రీవెన్స్లో ఆర్జీ ఇచ్చి విజప్తి చేస్తూ తమ గ్రామంలో తన జేబీనాయన కుందూరు చిన్నబ్బికి భూమి వారసత్వంగా తమకు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి 1998లోనే తన తండ్రి బసవయ్య శిస్తు కూడా చెల్లించారు. అయితే తన తల్లిదండ్రుల సంతకాలు లేకుండానే బొల్లా వెంకట సుబ్బయ్య, జిల్లా సుబ్బమ్మ తదితరులు ఆక్రమం గా రికార్డులను తమ పేర్ల మీద మార్చుకున్నారు. ఈ అన్యాయంపై జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయగా స్థానిక తహశీల్దార్ విచారణ జరిపి ఇది మీకే సంక్రమిస్తుంది’ అని ఎండార్స్ మెంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడున్న తహశీల్దార్ మాత్రం మాట మార్చి నీకు హక్కు లేదు. కోర్టుకు వెళ్ళండి అని దురుసుగా మాట్లాడుతున్నారు. కావున వారిపై చర్యలు తీసుకోని తమ భూమి సమస్యను పరిష్కరించాలని కోరాడు.

జమ్మలమడుగులో కబ్జాదారుల బరితెగింపు కులం పేరుతో దూషణలు

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సాకేవారి ఉప్పలపాడు గ్రామానికి సాంబశివయ్య గ్రీవెన్స్లో ఆర్ట్ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ తల్లి వెంగమ్మ పేరిట ఉన్న భూములు కె. సుబ్బారెడ్డి, కె.సహదేవ రెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఆక్రమణను ప్రశ్నించినం దురు, తనను కులం పేరుతో దూషిస్తూ నీ భూమి దగ్గరికి వస్తే నిన్ను చంపి అక్కడే పాతిపెడతాం” అని బెదిరింపులకు పాల్పడుతు న్నారు. కావున వారిపై చర్యలు తీసుకుని తమ సమస్యడు పరిష్కరించాలని కోరాడు. వీటితో పాటు పలువురు పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపై అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని కోరగా మరికొందరు ఉద్యోగాల కోసం రెస్యూమ్లు ఇచ్చారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం ఆర్థికతోడ్పాటు. కల్పించాలని మరికొందరు అభ్యర్థనలు గ్రీవెన్స్ లో నేతలకు అందించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

రైల్వే ఉద్యోగులకు 'ఎంప్లాయీ ఆఫ్ ది మంత్' భద్రతా అవార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha