YSRCP Tirupati DSC Protest: డీఎస్సీ 2025 నియామకాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం వై సి పి నాయకుల తొలి రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది.
Read Also : AP Cabinet Expansion: ఏపీ కేబినెట్‌లో ఐదుగురు మంత్రుల మార్పు?
YSRCP Tirupati DSC Protest: భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలో మాజీ మేయర్ శిరీష , నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ రిలే నిరాహార దీక్షలు ఆగస్టు 9 వరకు ప్రతిరోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. నిజాయితీగా చదివిన నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదనీ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలనీ డిమాండ్ చేశారు.

