Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ అనంత లోకాలకు

దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ అనంత లోకాలకు

వార్త 1 month ago

Zahirabad Road Accident: జహిరాబాద్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం ఇద్దరు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వాసుల మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ జహీరాబాద్ పట్టణ సమీపంలోని పస్తాపూర్ బైపాస్ పైన మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వాసులు మహారాష్ట్రలోని తుల్జాపూర్ తుల్జా భవాని మాత దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మంగళవారం ఉదయం జహీరాబాద్ బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్రక్కు రివర్స్ తీసుకుంటుండగా వెనకాలే ఉన్న టాటా ఏస్ వానాన్ని ఢీకొనడంతో టాటా ఏస్ వాహనం వెనకాల వస్తున్న చేవెళ్ల వాసుల కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న మహేష్ గౌడ్ 26 రోహిత్ 16 లు అక్కడికక్కడే మృతి చెందారు నర్సింలు 32 కార్తీక్ 27 సాయి 9లు తీవ్రంగా గాయపడ్డారు.

Zahirabad Road Accident: గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచాంగం నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha