Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి

వార్త 1 month ago

Kerala Road Accident: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు సంతోష్ కె. నాయర్ (65) రోడ్డు ప్రమాదానికి గురై కన్నుమూశారు.

ఈ ఘటన కేరళలోని పతనంతిట్ట జిల్లాలో చోటుచేసుకుంది.

Read Also : విజయ్ పార్టీకి ఆ పార్టీలు మద్దతు ఇస్తాయా ?

Kerala Road Accident: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

సంతోష్ నాయర్ తన భార్య శుభశ్రీతో కలిసి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు భార్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన భార్య విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు.

నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణం

1982లో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన సంతోష్ నాయర్, సుమారు 40 ఏళ్ల ప్రస్థానంలో 100కు పైగా సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. తనదైన సహజ సిద్ధమైన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'మోహినియాట్టం' ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. సంతోష్ నాయర్ మరణవార్త విని మలయాళ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్‌లో విషాదం.. యూనిట్ సభ్యుడి దుర్మరణం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha