Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ద.కొరియా సంస్థ 'సాఫ్ట్-ఈపీఐ'తో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ!

ద.కొరియా సంస్థ 'సాఫ్ట్-ఈపీఐ'తో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ!

వార్త 2 weeks ago

Nara Lokesh South Korea Tour: ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్, హైటెక్ సెమీకండక్టర్ డిస్‌ప్లే తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ హబ్‌గా నిలబెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది.

ఇందులో భాగంగా దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. రాజధాని సియోల్‌లో ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ మెటీరియల్ తయారీ దిగ్గజం ‘సాఫ్ట్-ఈపీఐ’ (Soft-Epi) ఉన్నతాధికారులతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో అపారంగా ఉన్న వనరులు, అనుకూలతలను ఉపయోగించుకుని ఇక్కడ ఒక మెగా మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కంపెనీ యాజమాన్యానికి ఆయన అధికారికంగా పిలుపునిచ్చారు.

Read Also :Chandrababu Naidu: సీఎం చంద్రబాబు కుప్పం టూర్ సక్సెస్..పెట్టుబడులు, సమస్యకు శాశ్వత పరిష్కారం

ఏపీలో డిస్‌ప్లే పర్యావరణ వ్యవస్థ – లోకేష్ విజ్ఞప్తి

సాఫ్ట్-ఈపీఐ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుంగ్ మిన్ హ్వాంగ్, సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చోలతో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ వినియోగం వేగంగా పెరుగుతోందని, దేశీయ మార్కెట్‌లోని ఇతర ప్రైవేటు సంస్థలతో జతకట్టి ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే హబ్‌ను నిర్మిస్తే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని మంత్రి వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పర్యావరణ వ్యవస్థ (Ecosystem) మరింత బలోపేతం అవుతుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐఐటీ తిరుపతితో లింక్ – ‘సాఫ్ట్-ఈపీఐ అకాడమీ’కి ప్రతిపాదన

పరిశ్రమల స్థాపనతో పాటు స్థానిక యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కల్పించడమే ధ్యేయంగా మంత్రి లోకేష్ మరో రెండు ప్రతిష్టాత్మక ప్రతిపాదనలను దక్షిణ కొరియా ప్రతినిధుల ముందుంచారు. ప్రఖ్యాత విద్యాసంస్థ అయిన ఐఐటీ తిరుపతి (IIT Tirupati) సహకారంతో ఏపీలో ఒక అత్యాధునిక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పాలి. ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘సాఫ్ట్-ఈపీఐ అకాడమీ’ని ప్రారంభించి, స్థానికంగా ఉన్న సుమారు 500 మంది టెక్నీషియన్లకు ప్రతి ఏటా GaN ఎపిటాక్సీ, ఎంఓసీవీడీ (MOCVD), మైక్రో ఎల్ఈడీ వంటి నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలపై అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ అందించాలి.

Nara Lokesh South Korea Tour: దక్షిణ కొరియా కంపెనీ సానుకూల స్పందన

మంత్రి లోకేష్ రోడ్‌మ్యాప్, ఆకర్షణీయమైన రాయితీ ఆఫర్లపై సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ ఎంతో సానుకూలంగా స్పందించారు. తమ సంస్థ దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా అధునాతన GaN ఎపివేఫర్లు, మైక్రో-ఎల్ఈడీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో తమకు ఎలాంటి నేరుగా తయారీ ప్లాంట్లు లేవని చెబుతూనే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మెగా ప్రాజెక్ట్ ప్లాన్‌ను బోర్డు వ్యాప్తంగా క్షుణ్ణంగా సమీక్షించి, దేశంలో తమ తొలి పెట్టుబడి కేంద్రంగా ఏపీని ఎంపిక చేసుకునే అంశంపై సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉన్నత స్థాయి భేటీతో ఆంధ్రప్రదేశ్‌కు మరో అంతర్జాతీయ పెట్టుబడి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నేటి తాజా రేట్లు

    Dailyhunt
    Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha