Ilaiyaraaja on Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న తరుణంలో, ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్‌కు ఆయన తన పరోక్ష మద్దతును ప్రకటించారు.
Read Also: Maharashtra Crime: పూణేలో నాలుగేళ్ల పాపపై 65 ఏళ్ల కామాంధుడి ఘాతుకం!
Ilaiyaraaja on Vijay: పాత పాటలో కొత్త అర్థం!
1988లో వచ్చిన ‘ఇదు ఎంగళ్ నీది’ చిత్రంలోని ఆడియో ట్రాక్‌ను ఇళయరాజా షేర్ చేశారు. ఈ సినిమాలో విజయ్ బాలనటుడిగా కనిపించారు. అందులోని “చిన్న తంబి.. ఉన్నై నంబి…” అనే చరణాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. “చిన్న తమ్ముడూ.. నిన్నే నమ్మి” అనే అర్థం వచ్చేలా ఉన్న ఈ పాట, విజయ్‌ను రాష్ట్ర భవిష్యత్తు నాయకుడిగా ఇళయరాజా అభివర్ణిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
రాజకీయ ప్రాధాన్యత
బిజెపి ద్వారా రాజ్యసభకు నామినేట్ అయిన ఇళయరాజా, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టిన విజయ్‌కు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది. విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ నెలకొన్న వేళ, మేస్ట్రో నుంచి వచ్చిన ఈ సంకేతం విజయ్ అభిమానుల్లో జోష్ నింపింది. మే 4న రాబోయే ఫలితాల్లో విజయ్ పార్టీ ఎంజీఆర్, జయలలిత స్థాయి మేజిక్ చేస్తుందో లేదో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
యూనివర్సిటీలో ఉడుత బీభత్సం: 18 మందికి పైగా గాయాలు!

