Maharashtra Crime: మహారాష్ట్రలో పసిపాపపై జరిగిన ఒక అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వేసవి సెలవులకు వచ్చిన ఒక నాలుగేళ్ల చిన్నారి, కామాంధుడి చేతిలో బలైపోయిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పూణే జిల్లా భోర్ తాలూకాలోని నస్రాపూర్ గ్రామంలో ఈ హేయమైన చర్య చోటుచేసుకుంది.
Read Also: Shamshabad Accident: శంషాబాద్ రోడ్డు ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి
మాయమాటలు చెప్పి పశువుల పాకలోకి..
బాలిక సెలవుల కోసం తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శనివారం ఇంటి బయట ఆడుకుంటున్న పాపను చూసిన 65 ఏళ్ల నిందితుడు, మాయమాటలు చెప్పి సమీపంలోని పశువుల పాకలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన ఘాతుకం బయటపడుతుందన్న భయంతో చిన్నారి తలపై బండరాయితో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆవు పేడ కుప్పలో దాచిపెట్టాడు.
Maharashtra Minor Girl Murder Case
Maharashtra Crime: సిసిటీవీ ఫుటేజీతో దొరికిపోయిన నిందితుడు
పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టగా, పశువుల పాకలో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడు బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు ఆధారంగా దొరికిపోయాయి. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్త తెలియగానే స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసుల నిర్లక్ష్యంపై నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. ఈ అమానుషానికి నిరసనగా నస్రాపూర్ బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడగా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

