Electronics price rise:అక్టోబర్ 1 నుంచి ఏసీ టీవీల ధరలు పెరగనున్నాయి. పండగ సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఎలక్ట్రానిక్స్ ప్రియులకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.
మార్కెట్లో ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు అలాగే ఎల్ఈడీ టీవీల ధరలను ఐదు నుంచి ఎనిమిది శాతం వరకు పెంచాలని ప్రముఖ కంపెనీలు నిర్ణయించాయి. ఈ ఏడాదిలో ఇలా ధరలు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిసరుకుల రేట్లు విపరీతంగా ఎగిశాయి. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు చాలా వరకు పెరుగుతున్నాయని తయారీ సంస్థలు స్పష్టం చేశాయి.
Read also: Gold Prices Today: నేటి బంగారం ధరలు ఇవే!
Prices of ACs and TVs set to rise sharply from October 1!
పెరిగిన రాగి ధరలతో భారం
ప్రపంచవ్యాప్తంగా రాగి ధరలు విపరీతంగా పెరగడం ప్రధాన కారణం అయింది. గతంలో టన్ను ఎనిమిది నుంచి తొమ్మిది వేల డాలర్లు ఉన్న కాపర్ ధర ఇప్పుడు ఏకంగా పద్నాలుగు వేల ఐదు వందల డాలర్లకు చేరింది. ఒక ఏసీ తయారు చేయాలంటే సుమారు మూడు నుంచి నాలుగు కిలోల రాగి కచ్చితంగా అవసరం అవుతుంది. దీనివల్ల తయారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. బ్లూ స్టార్, గోద్రెజ్, హయర్ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే తమ ఉత్పత్తుల రేట్లను నాలుగు నుంచి పది శాతం వరకు సవరించాయి. చిన్న స్క్రీన్ టీవీలపై ఇరవై శాతం వరకు, పెద్ద స్క్రీన్లపై పది శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.
Electronics price rise:పండుగ సీజన్ పై పడే ప్రభావం
సాధారణంగా దసరా నుంచి దీపావళి వరకు ఉండే పండగ సీజన్‌లోనే కంపెనీలకు అత్యధిక వ్యాపారం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ధరలు పెరగడం వల్ల అమ్మకాలపై కొంత ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే చాలా మంది డీలర్లు ఇప్పటికే పాత ధరలతో భారీగా స్టాక్‌ను కొనుగోలు చేసి ఉంచారు. దీనివల్ల ప్రస్తుత దీపావళి వరకు పాత ధరలకే సామాన్యులకు వస్తువులు దొరికే అవకాశం ఉంది. పండుగలు ముగిసిన తర్వాతే ఈ కొత్త ధరల పూర్తి ప్రభావం వినియోగదారులపై పడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com
భారత్‌లో లాంచ్‌కు రెడీ.. తొలుత ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులతోనే!

