New Pensions: పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
దసరా పండుగకు ముందే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త పెన్షన్ల అమలుకు సంబంధించిన ప్రక్రియ అధికారులు వేగవంతం చేశారు. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. రాబోయే అక్టోబర్ నెల నుంచి అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ ప్రక్రియ అధికారికంగా ప్రారంభించాలని సీతక్క అధికారులకు స్పష్టం చేశారు. పండుగ సమయానికి ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో దసరా పండుగకు ముందే కొత్త పెన్షన్లు అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు.
Telangana: రైతులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ మొదటి వారం నుంచే వడ్ల కొనుగోళ్లు
New Pensions
New Pensions : ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పథకం
దరఖాస్తు చేసుకున్న వారిలో పూర్తి స్థాయిలో అర్హత కలిగిన ఒంటరి మహిళలు, వితంతువులకు ఈ పథకం కింద ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్లు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు. పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క నిజమైన అర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం, మంత్రుల ఆదేశాల మేరకు యంత్రాంగం దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఆలస్యం లేకుండా పింఛను అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

