Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దసరా ప్రయాణికులకు టికెట్ ధరల షాక్

దసరా ప్రయాణికులకు టికెట్ ధరల షాక్

వార్త 1 week ago

Dasara bus ticket prices:దసరా బతుకమ్మ పండుగ సమయం దగ్గర పడటంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వాహకులు ప్రయాణికులపై విపరీతమైన భారం మోపుతున్నారు.

తెలంగాణలో పండుగ రద్దీని ఆసరాగా చేసుకునిప్రైవేట్ ట్రావెల్ బస్సుల టికెట్ ధరలు ఎక్కడికక్కడ అమాంతం మూడొంతులు పెంచేశారు. అక్టోబరు 9వ తేదీన కూకట్‌పల్లి నుంచి విజయవాడకు వెళ్లిన ఒక ఏసీ స్లీపర్ బస్సు టికెట్ ధరను సాధారణంగా ఉండే రూ.580 నుంచి రూ.700 పరిధి దాటించి ఏకంగా రూ.1,700 వరకు వసూలు చేశారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ బస్సుల పేరిట రెట్టింపు రేట్లు లాగుతున్నాయి. మహబూబ్‌నగర్ వరంగల్ కరీంనగర్ మార్గాల్లో ప్రయాణించే సామాన్యులు ఈ పెంచిన చార్జీలు చూసి ఆందోళన చెందుతున్నారు. ఏజెంట్లను అడిగితే ఆలస్యం చేస్తే ధర ఇంకా పెరుగుతుందని చెప్పి ప్రయాణికులతో బలవంతంగా కొనిపిస్తున్నారు.

Hyderabad Groundwater: వర్షపాతం లోటుతో పెరుగుతున్న నీటి కష్టాలు

 private travel buses ticket prices

ఒకే నంబరుతో తిరుగుతున్న 2 బస్సులు పట్టివేత

పండుగ సమయాన్ని లాభంగా మార్చుకోవడానికి కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ పాతవి ఫిట్‌నెస్ లేని బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా రవాణా శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి శనివారం నాటి తనిఖీల్లో ఒకే నంబరుతో నడుస్తున్న 2 బస్సులను స్వాధీనం చేసుకున్నారు. సాజన్ ట్రావెల్స్ సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండా ఈ నకిలీ నంబరు బస్సులను నడుపుతున్నట్లు గుర్తించారు. జాయింట్ ట్రాన్స్​పోర్ట్ కమిషనర్ వెంకటరమణ ఆదేశాల మేరకు ఆర్టీవో రవికుమార్ ఇన్ స్పెక్టర్ హర్షితలు ఈ ఉల్లంఘనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్సులు నడిపినా అధిక ధరలకు టికెట్లు అమ్మానా సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Dasara bus ticket prices:మధ్యలో దిగే వారికి మిగిలిన తీవ్ర ఇబ్బందులు

భువనగిరి జనగామ సూర్యాపేట కోదాడ వంటి మధ్య దారిలోని ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రైవేట్ బస్సుల వల్ల చుక్కలు కనిపిస్తున్నాయి. వరంగల్ మరియు విజయవాడ మార్గాల్లో ప్రయాణించే బస్సులు మధ్య స్టాప్‌లలో దిగే ప్రయాణికులను అస్సలు ఎక్కించుకోవడం లేదు. విజయవాడ వరకు పూర్తి టికెట్ తీసుకుంటానని కోదాడలో ఆపితే దిగిపోతానని ప్రయాణికులు కోరినా డ్రైవర్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేరుగా బస్టాండుకు వెళ్లి బతిమాలినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోతోందని ప్రయాణికులు వాపోతున్నారు. పండుగ వేళ సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే సామాన్యుల అవసరాలను ప్రైవేట్ యాజమాన్యాలు ఈ రకంగా సొమ్ము చేసుకుంటున్నాయి.

Epaper: epaper.vaartha.com

షాక్ ఇస్తున్న సన్నబియ్యం రేట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha