Telangana rice prices:షాకింగ్ న్యూస్.. బియ్యం కొరతతో రైస్ ధరలు పెరుగుదల! తెలంగాణ వ్యవసాయ రంగంపై వర్షాభావం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది 740 మి.మీ.
కురవాల్సిన వర్షపాతం కేవలం 615 మి.మీ. మాత్రమే నమోదైంది. ఈ 17 శాతం లోటు వల్ల గత ఏడాది 92.17 లక్షల ఎకరాల్లో ఉన్న వరి సాగు, ఈసారి 78.23 లక్షల ఎకరాలకు పడిపోయింది. నీటి లభ్యత తగ్గడంతో దక్షిణ తెలంగాణ ప్రాంతంలో పంట దిగుబడులు దారుణంగా దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.
AP liquor shop notification: ఈ నెల 19 వరకు దరఖాస్తులు
Rice prices rise due to rice shortage!
జేబులకు చిల్లు.. రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?
సన్న బియ్యం లభ్యత తగ్గి మార్కెట్లో డిమాండ్ పెరగడంతో వ్యాపారులు రేట్లు పెంచుతున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకారం జూలై నుండి సెప్టెంబర్ నాటికే సన్న బియ్యం రేట్లు 13.32 శాతం పెరిగాయి. దేశంలోనే రెండవ అత్యధిక పెంపు నమోదు చేసి తెలంగాణ రికార్డు సృష్టించింది. రాబోయే రోజుల్లో కొరత వస్తుందనే ఆందోళనతో వినియోగదారులు బియ్యాన్ని ముందస్తుగా నిల్వ చేసుకోవడం రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది.
Telangana rice prices:సైంటిస్ట్ వార్నింగ్.. రైతులు ఇప్పుడు ఏం చేయాలి?
వరికి నీటి అవసరం ఎక్కువ కాబట్టి తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. అపరాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు సాగు చేయడం మంచిదని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయ సైంటిస్ట్ మహదేవప్ప సూచించారు. సెప్టెంబర్ చివరి వారంలో పడిన వర్షాలు ఉత్తర, మధ్య తెలంగాణ ప్రాంతాలకు కొంత ఉపశమనం అందించాయి. రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపితే నష్టాల నుండి తప్పుకోవచ్చు.
Epaper: epaper.vaartha.com

