Tata Motors: దసరా పండుగల శుభసందర్భంగా కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ శుభవార్త అందించింది. ఈ అక్టోబర్ నెలలో తన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ (EV) కార్లపై ప్రత్యేక పండుగ ఆఫర్లు ప్రకటించింది.
వాహన మోడల్, వేరియంట్, ఇంధన రకం ఆధారంగా ఈ ఆఫర్లు మారుతుంటాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లపై భారీ రాయితీలు ఇస్తుండగా, కొన్ని పెట్రోల్, డీజిల్ మోడళ్లపై ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు అందిస్తూ గరిష్ఠంగా రూ. 3.35 లక్షల వరకు ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కల్పించింది.
Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ ఎడిషన్ లాంచ్
Tata Motors bumper offers on Dussehra.. Here are the full details
Tata Motors: వివిధ మోడళ్లపై లభించే ఆఫర్లు & డిస్కౌంట్ల వివరాలు
హ్యాచ్‌బ్యాక్ & సెడాన్ కార్లు (టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్):
- టాటా టియాగో (పెట్రోల్, సీఎన్‌జీ): పాత మోడళ్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో రూ. 15,000 వినియోగదారుల ప్రయోజనం, రూ. 5,000 కంపెనీ మద్దతుతో పాటు ఎక్స్ఛేంజ్‌పై రూ. 10,000, స్క్రాపేజ్‌పై రూ. 15,000 వరకు అదనపు లబ్ధి పొందవచ్చు.
- టాటా టిగోర్: ఈ సెడాన్ మోడల్‌పై రూ. 30,000 వరకు ఆఫర్ అందుబాటులో ఉంది.
- టాటా ఆల్ట్రోజ్: సీఎన్‌జీ మోడళ్లపై రూ. 55,000 వరకు, పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు ప్రకటించారు.
ఎస్‌యూవీలు (పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సఫారీ, సియెర్రా):
- టాటా పంచ్ & ఏరీస్: పంచ్ పెట్రోల్ మోడల్ మరియు ఏరీస్ మోడళ్లపై ఈ నెలలో ఎలాంటి పండుగ ఆఫర్లు లేవు.
- టాటా నెక్సాన్: పెట్రోల్ మాన్యువల్‌లోని ఎంపిక చేసిన వేరియంట్లపై రూ. 75,000 వరకు, సీఎన్‌జీ మోడళ్లపై రూ. 60,000 వరకు, పెట్రోల్‌పై రూ. 55,000, డీజిల్ వేరియంట్లపై రూ. 20,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
- టాటా కర్వ్ (పెట్రోల్ & డీజిల్): 'ఎక్స్' వేరియంట్లు మినహా మిగతా మోడళ్లపై రూ. 1.25 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. 'ఎక్స్' వేరియంట్లపై మాత్రం రూ. 20,000 లాయల్టీ ప్రయోజనం అందుబాటులో ఉంది.
- హారియర్, సఫారీ & సియెర్రా: హారియర్, సఫారీ పెట్రోల్, డీజిల్ మోడళ్లపై రూ. 45,000 వరకు ప్రయోజనాలు ఉండగా, ఇటీవల పరిచయం చేసిన టాటా సియెర్రా పెట్రోల్, డీజిల్ వేరియంట్లపై రూ. 30,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
టాటా ఎలక్ట్రిక్ కార్ల (EVs) పై ధమాకా డిస్కౌంట్లు
- పంచ్ ఈవీ (Punch EV): లాంగ్ రేంజ్ వేరియంట్లపై రూ. 1.45 లక్షల వరకు, మీడియం రేంజ్ మోడళ్లపై రూ. 1.25 లక్షల వరకు, స్మార్ట్ వేరియంట్లపై రూ. 95,000 వరకు తగ్గింపులు లభిస్తాయి.
- నెక్సాన్ ఈవీ (Nexon EV): రూ. 10,000 గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ప్రయోజనాలతో కలిపి రూ. 45,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
- కర్వ్ ఈవీ (Curvv EV): ఈ మోడల్‌పై అత్యధికంగా రూ. 3.35 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించారు. క్రియేటివ్ వేరియంట్‌పై రూ. 2.85 లక్షలు, ఎక్స్ వేరియంట్లపై రూ. 65,000 వరకు ఆఫర్లు ఉన్నాయి.
- హారియర్ ఈవీ (Harrier EV): ఫియర్‌లెస్, ఎంపవర్డ్ వేరియంట్లపై కంపెనీ సపోర్ట్, ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ ప్రయోజనాలతో కలిపి రూ. 2.75 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
మడతపెట్టే ఐఫోన్ వచ్చేసింది.. 7.6 అంగుళాల స్క్రీన్‌తో కొత్త ఫోన్

