రికార్డు స్థాయి కొనుగోళ్లు అంటూ అబద్ధపు ప్రచారం
Telangana Farmers: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ మాత్రం రికార్డు స్థాయి కొనుగోళ్లు అంటూ అబద్దపు ప్రచారంతో రైతులను మోసం చేస్తుందని బిజెపి శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
నిర్మల్లో జరిగిన జరిగిన మహా ధర్నాలో ఆయన మాట్లుడుతూ, కోతకు వచ్చిన పంట రైతుల కళ్ల ముందే తడిసిపోతుంటే, గిట్టరబాటు ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ప్రభుత్వం మాత్రం ప్రకటనలతో కాలక్షేపం చేస్తుందని ఆగ్రహం వక్తం చేశారు.
Read Also: Gas : గ్యాస్ సిలిండర్ల ఆటోలకు ఎస్కార్ట్..ఇదేందయ్యా… ఇది నేను ఎక్కడ చూడలే !!
Grain purchases in Telangana have been hampered
Telangana Farmers: ప్రభుత్వం 17.28 లక్షల టన్నులే కొనుగోలు చేసింది
ఆదిలాబాద్ నుంచి గద్వల్ వరకు, నిజామాబాద్ నుంచి మహబూబాబాద్ వరకు ఎక్కడ చూసిన రైతు గోసే వినిపిస్తుందని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. వరి విషయంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండగా, ప్రభుత్వం 90 లక్షల టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కేవలం 17.28 లక్షల టన్నులే కొనడం సివిల్ సప్లై శాఖ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. మే నెల సగం గడిచినా 80శాతానికి పైగా కొనుగోళ్లు పెండింగ్లో ఉండటం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చూపిస్తుందన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి తేమ శాతం పేరుతో కొర్రీలు పెట్టి బోనస్ ఎగ్గొడుతున్నారని మండిపడ్డారు.
దళారుల చేతుల్లో రైతులకు నష్టం
మక్క జోన్న రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని పేర్కొన్నారు. మద్దతు ధర రూ.2400 ఉండగా, మార్కెఫెడ్ జాప్యం చేయడం వల్ల దళారులు రూ.1600 కే కొనుగోలు చేస్తూ రైతులను క్వింటాలుకు దాదాపు రూ.800 నష్టపోతున్నారని, పొద్దుతిరుగుడు సైతం అదే పరిస్థితి నెలకొందన్నారు. తూకం వేసిన ధాన్యం 15 రోజుల పాటు కేంద్రాల్లో నిల్వ ఉండే పరిస్థితికి ముగింపు పలకాలని, ధాన్యాం సేకరణ కేంద్రాల నుంచి గిడ్డంగుల వరకు జిపిఎస్ ఆధారిత పారదర్శక రవాణా వ్యవస్తను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుపై ఒక్క రూపాయ భారం పడకుండా గన్నీ బ్యాగులు ఉచితంగా సరఫరా చేయాలన్నారు. రైతు కన్నీరు ఈ ప్రభుత్వాన్ని క్షమించదని, అన్నదాతను మోసం చేసిన ప్రతి నిర్ణయానికి ప్రభుత్వం ప్రజల ముందు సమాధానం చెప్పాలన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

