Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డే టైమ్ లో ఒక్క ట్యూబ్ లైట్ కూడా వేయకండి - సీఎం రేవంత్

డే టైమ్ లో ఒక్క ట్యూబ్ లైట్ కూడా వేయకండి - సీఎం రేవంత్

వార్త 11 hrs ago

Power Woes : రాబోయే ఎండల తీవ్రత మరియు నీటి ఎద్దడి కారణంగా విద్యుత్ వినియోగం అసాధారణంగా పెరిగే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

అందువల్ల, పగటిపూట సహజ సిద్ధమైన వెలుతురు ఉన్న సమయంలో అవసరం లేకపోయినా ట్యూబ్ లైట్లు వేసే అలవాటును మానాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పొదుపు చర్యలను కేవలం సామాన్య ప్రజలకే పరిమితం చేయకుండా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ పటిష్టంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. రోజువారీ పరిపాలనా కార్యకలాపాల్లో వీలైనంత వరకు ట్యూబ్ లైట్లు, ఎయిర్ కండిషనర్ల (ACs) వాడకాన్ని తగ్గించాలని, ఇంధన పొదుపు విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు.

మార్కెట్లో దొరకని విద్యుత్ - ప్రజల భాగస్వామ్యంతోనే గండం నుంచి గట్టెక్కే అవకాశం

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఎంత ఖర్చు చేసైనా సరే బయట మార్కెట్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఓపెన్ మార్కెట్‌లో విద్యుత్ లభ్యత అత్యంత అరుదుగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత డబ్బు వెచ్చించినా విద్యుత్ దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రజలు చేసే సద్వినియోగం మరియు పొదుపే నిజమైన వెలుగునిస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే క్లిష్ట సమయాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ బాధ్యతాయుతంగా విద్యుత్‌ను పొదుపు చేస్తూ రాత్రి, పగలు తేడా లేకుండా అవసరం లేని చోట విద్యుత్ ఉపకరణాలను నిలిపివేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

కోతుల భయంతో పరుగులు..గుండె ఆగి బాలుడి మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha