Dailyhunt

Delhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

వార్త 3 months ago
Delhi: ప్రియాంకాగాంధీ ర్యాలీలో కాబోయే కోడలు.. వీడియో వైరల్

కాంగ్రెస్(Congress) అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి.

కుమారుడు రైహాన్ వాద్రా(Raihan Vadra) ఇటీవల స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం జరిగినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అధికారికంగా ఇరు కుటుంబాలు ప్రకటించకపోయినా రైహాన్ వాద్రా-అవివా బేగ్ కు నిశ్చితార్థం జరిగిపోయినట్లుగా నివేదికలు అందుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Read Also:IRCTC: తమిళనాడు-పుదుచ్చేరి ప్రత్యేక రైల్ టూర్ ప్రారంభం

అవివా బేగ్ వీడియో వైరల్

తాజాగా అవివా బేగ్ కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది వయనాడ్ లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ పోటీ చేశారు. ఆ సందర్భంగా జరిగిన ఎన్నికల ర్యాలీలో కాబోయే కోడలు అవివా బేగ్ ప్రత్యక్షమయ్యారు. రైహాన్ వాద్రాతో కలిసి ర్యాలీలో రైహాన్ వాద్రా పక్కన నిలబడిన అవివా బేగ్ చాలా ఉల్లాసంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా(25) తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఢిల్లీ కి చెందిన అవివా బేగ్(Aviva Baig) తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్ కు రైహాన్ పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందాయి. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అవివా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీ(Delhi)లో స్థిరపడింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

వైల్ లైఫ్ ఫొటోగ్రపీతో రైహాన్ కు మంచి గుర్తింపు

రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు, వైల్డ్ లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులో కెమెరా చేపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫొటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతో ప్రోత్స హించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్ లో 'డార్క్ పర్సెప్షన్' పేరుతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్, ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా వెలువడలేదు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ISRO: ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha