Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డెలివరీ బాయ్‌ని కొట్టిన 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో..

డెలివరీ బాయ్‌ని కొట్టిన 'రాజు వెడ్స్ రాంబాయి' హీరో..

వార్త 3 weeks ago

Hero Akhil Raj Controversy: 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్‌ హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు.

ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, భౌతిక దాడికి ప్రయత్నించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.

ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున వేరొకరి ఆర్డర్ ను హీరో అఖిల్ రాజ్ నివాసానికి తీసుకువచ్చాడు. తాను వేరే అడ్రస్‌కు రావాల్సిన పార్సిల్‌ను మార్చి తెచ్చానని గ్రహించిన డెలివరీ బాయ్, వెంటనే క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ హీరో అఖిల్ రాజ్, ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ గొడవ జరుగుతున్న సమయంలో బాధితుడైన డెలివరీ బాయ్ తన ఫోన్‌లో దృశ్యాలను రికార్డ్ చేశాడు.

Read Also : Pawan Injury : పవన్ కళ్యాణ్ కు గాయం అని తెలిసి ఎమోషనలైనా బండ్ల గణేష్

 ‘Raju Weds Rambai’ hero hits delivery boy

Hero Akhil Raj Controversy: వైరల్ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు

నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆ వీడియోలో.. డెలివరీ బాయ్ మెట్లపై నుంచి కిందకు దిగుతుండగా, హీరో అఖిల్ రాజ్ తీవ్ర కోపంతో అతని వైపు దూసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చేయి చేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న కొందరు మహిళలు అఖిల్‌ను పట్టుకుని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన శాంతించకుండా సదరు డెలివరీ బాయ్‌పై తీవ్ర స్వరంతో అరుస్తూ కనిపించారు.

బాధితుడి ఆవేదన.. నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

ఈ ఘటనపై బాధితుడైన డెలివరీ బాయ్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. “నేను పొరపాటు జరిగిందని చెప్పి, క్షమించమని కోరినా వారు వినలేదు. హీరో నాపై దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా హీరో తల్లి నా ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించారు” అని ఆరోపించాడు. ఒక చిన్న పొరపాటుకు సెలబ్రిటీలు ఇంత అహంకారపూరితంగా ప్రవర్తించడం దారుణమని, కష్టపడి పనిచేసే డెలివరీ సిబ్బందికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కేవలం డెలివరీ బాయ్ చిత్రీకరించిన వీడియో, అతని ఆరోపణలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అసలు గొడవకు దారితీసిన పూర్తి కారణాలు, రెండో పక్షం (హీరో కుటుంబం) వాదన ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వివాదంపై హీరో అఖిల్ రాజ్ లేదా అతని ప్రతినిధులు స్పందిస్తేనే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha