Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశ హితం కోసం ప్రధాని పని చేస్తున్నారు!

దేశ హితం కోసం ప్రధాని పని చేస్తున్నారు!

వార్త 3 months ago

MP Raghunandan Rao: భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ హితం, జనహితం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొనియాడారు. శుక్రవారం సరస్వతి శిశు మందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'సంస్కృతి వేసవి శిక్షణ శిబిరం' ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.

పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపుపై ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ఆదర్శంగా తీసుకుంటూ, ఎంపీ రఘునందన్ రావు స్వయంగా తానే ఎలక్ట్రిక్ కార్ (EV) డ్రైవ్ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి రావడం అందరినీ ఆకట్టుకుంది.

Read Also: Petrol Price Hike: ఎన్నికలు అవ్వగానే పెట్రోల్ బాదుడు.. కేంద్రంపై ఎమ్మెల్యే యెన్నం ఫైర్!

విపక్షాల తీరుపై మండిపాటు

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘునందన్ రావు, ప్రధాని మోడీ ఏ విషయం మాట్లాడినా కాంగ్రెస్ నాయకులు గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గతంలో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనవద్దని చెప్పినప్పుడు నోరు మెదపని నాయకులు, ఇప్పుడు ప్రధాని మోడీ దేశ భవిష్యత్తు కోసం పొదుపు పాటించాలని చెబితే ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ముందుచూపుతో తీసుకుంటున్న నిర్ణయాలను సామాన్య ప్రజలు పూర్తిస్థాయిలో స్వాగతిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఎలక్ట్రిక్, సోలార్ వాహనాలే భవిష్యత్తు

ప్రధాని మోడీ పిలుపునకు మద్దతుగా తానే స్వయంగా నేటి నుంచి ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగిస్తున్నట్లు రఘునందన్ రావు ప్రకటించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సోలార్ విద్యుత్ వైపు మొగ్గు చూపాలని కోరారు. పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నవారు తమ ఇళ్లపై సోలార్ ప్లేట్లను అమర్చుకోవాలని పిలుపునిచ్చారు.

MP Raghunandan Rao: కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని ఉపయోగించుకోండి

సౌరశక్తిని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అందిస్తున్న భారీ సబ్సిడీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు. రెండు కిలోవాట్ల సోలార్ ప్లేట్లను ఇంటిపై అమర్చుకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి రూ. 78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, ప్రముఖ నాయకులు బాసంగారి వెంకట్, తుంగ కనకయ్య, కాసానిగొట్టు సంతోష్, మీడియా సెల్ జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు తదితరులు పాల్గొని ప్రధాని మోడీ పిలుపును ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ.. నాంపల్లిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha