Economy : దేశీయ లావాదేవీలు సహా దిగుమతుల ద్వారా పన్ను వసూళ్లు పెరగడంతో జులైలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది జులైతో పోలిస్తే ఈ వసూళ్లు 15.4శాతం ఎక్కువని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది.
సీజీఎస్టీ రూ.39,835 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.47,881 కోట్లు, ఐజీఎస్టీ వసూళ్లు రూ.1,23,000 కోట్లుగా ఉన్నాయి. గతనెలలో రిఫండ్లు 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు చేరుకున్నాయి. రిఫండ్లను మినహాయించిన అనంతరం నికర జీఎస్టీ ఆదా యం 1.81లక్షల కోట్లుగా ఉంది. దేశీయ వ్యాపార లావా దేవీలు ఊపందుకోవడం, విదేశాల నుంచి దిగుమతులు భారీగా పెరగడంతో భారత ఆర్ధిక వ్యవస్థ మరోసారి తన బలాన్ని చాటుకుంది. జూలై నెలలో దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరుకుని కొత్త రికార్డు నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం వృద్ధి నమోదవగా, గత 14 నెలల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు కావడం విశేషం, దిగుమతులపై వసూలైన జీఎస్టీ 28.8 శాతం పెరిగి రూ.66,511 కోట్ల కు చేరగా, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ 10.1శాతం వృద్ధితో రూ.1.45లక్షల కోట్లుగా నమోదైంది.
Economy
Economy : ఆల్టైమ్ రికార్డు
దేశంలో వినియోగం, వ్యాపార కార్యకలాపాలు మరింత బలపడుతున్నాయనే సంకేతాలను ఈ గణాంకాలు తెలియ జేస్తున్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరంలో రెండోసారి రూ.2 లక్షల కోట్ల మార్కు. ఏప్రిల్లో రూ.2.43 లక్షల కోట్ల ఆల్టైమ్ రికార్డు నమోదైన తర్వాత, మేలో రూ.1.94 లక్షల కోట్లు, జూన్లో రూ.1.95 లక్షల కోట్లు వసూలయ్యా యి. జూలైలో మళ్లీ రూ.2.11 లక్షల కోట్లతో రూ.2 లక్షల కోట్ల మార్కును దాటి మరోసారి రికార్డు సృష్టించింది. వ్యాపారులకు రూ.29,968 కోట్ల రీఫండ్లు చెల్లించిన తర్వాత ప్రభుత్వానికి వచ్చిన నికర జీఎస్టీ ఆదాయం రూ.1.81 లక్షల కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం అధికం. ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులై వరకు మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో వసూలైన రూ.7.66 లక్షల కోట్లతో పోలిస్తే 10.1శాతం వృద్ధి నమోదైంది. ఈ సారి జీఎస్టీ వృద్ధికి ప్రధాన కారణం దిగుమతులపై పన్ను వసూళ్లు భారీగా పెరగడమేనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో దేశీయ ఆర్థిక కార్యక లాపాలు కూడా బలంగా కొనసాగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్రాల వారీగా వరిశీలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ వసూళ్ల లో రెండంకెల వృద్ధిని నమోదు చేసి దేశంలోనే అత్యు త్తమ ప్రదర్శన కనబర్చాయి. ఇది రెండు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నెల వారీ జీఎస్టి ఆదాయ నివేదిక ప్రకారం, జులై నెలలో మొత్తం జీఎస్టి వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లకు చేరు కున్నాయి. గతేడాది జూలై నెలతో పోలిస్తే వార్షిక ప్రాతి పదికన 15.4 శాతం పెరుగుదల కనిపించింది.
జీఎస్టీలో గణనీయ మైన పెరుగుదల
డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్, దిగుమతులకు సంబంధించిన ఆదాయం వలన జీఎస్టీ వసూళ్లు జోరు కొనసాగుతోందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన గ్రాస్ జీఎస్టి ఇన్కమ్, గత ఏడాది ఇదే నెలలో నమోదైన రూ.1.31లక్షల కోట్ల నుంచి 10.1 శాతం పెరిగి, 2026 జూలైలో రూ.1.45 లక్షల కోట్లకు చేరింది. దీని తోపాటు దిగుమతులపై వసూలైన జీఎస్టీలో గణనీయ మైన పెరుగుదల కనిపించింది. దిగుమతులకు సంబంధిం చిన జీఎస్టి ఆదాయం ఏదాది ప్రాతిపదికన 28.8 శాతం పెరిగి రూ.66,511 కోట్లకు చేరింది. ఇది ఆ నెలలో దేశం మొత్తం స్థూల జీఎస్టి వసూళ్లను రూ.2.11 లక్షల కోట్లకు పెరిగేందుకు కారణమైంది. జూలై నెలలోప్రభుత్వం ఎక్కువ మొత్తంలో జీఎస్టి రీఫండ్లను కూడా జారీ చేసిం ది. గత ఏడాదితో పోలిస్తే మొత్తం రీఫండ్లు 13.1 శాతం పెరిగి రూ. 29,968 నోట్లకు చేరాయి. ఈ రీఫండ్స్ విష యంలో ఎక్కువగా గణనీయంగా ఎగుమతిదారుల వాటా ఉంది. ఐస్ట్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేయబడిన రీఫండ్స్ ఏడాదితో పోలిస్తే 22.7 శాతం పెరిగి రూ.12.288 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీరీఫండ్స్ ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, నికర జీఎస్టి వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇది జూలై 2025తో పోలిస్తే 15.8 శాతం పెరుగుదల. నెట్ డొమెస్టిక్ రెవెన్యూ 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరగా, నికర కస్టమ్స్ జీఎస్టి ఆదాయం 30.3 శాతం భారీవృద్ధితో రూ.54,223 కోట్లకు పెరిగింది.
Economy
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతమ
కేంద్ర ఆర్థిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఏప్రిల్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2.43 లక్షల కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో దేశీ దిగుమతుల ద్వారా జీఎస్టీ రెవెన్యూ 28.8 శాతం పెరిగింది. దీంతో వరుసగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ వసూళ్లలో హరియాణా రాష్ట్రం అత్యధిక వృద్ధిని సాధించింది. పెద్ద రాష్ట్రాలతో పోల్చి హర్యానా రాష్ట్రం అత్యధిక వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది. గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు ఆ తర్వాత జాబితాలో ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లలో 19శాతం వృద్ధిని నమోదు చేశాయి. పంజాబ్, కేరళ రాష్ట్రాలు 16 శాతం, ఉత్తరప్రదేశ్ టీఎస్టీ వసూళ్లలో 15 శాతం పెరుగు దలను నమోదుచేశాయి. జీఎస్టీ ఆదాయానికి దేశంలోనే అత్యధికంగా సహకరిస్తున్న మహారాష్ట్ర 13 శాతం వృద్ధిని నమోదు చేయగా, కర్ణాటక 12శాతం పెరుగుదలను నివేదించింది. ఢిల్లీలో జీఎస్టీ వసూళ్లు 8శాతం పెరిగాయి. జులై నెలలో జీఎస్టి కింద నమోదైన ఆదాయం సీజీఎస్టీ రూ.39,835 కోట్లు ఉండగా, రాష్ట్ర వస్తు, సేవలపన్ను ఎస్టీఎస్టీ రూ.47,881 కోట్లు, ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీవసూళ్లు రూ.1.23 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.
-ఇస్కా రాజేష్ బాబు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

