Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
టాటా నుంచి కొత్త ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు!

టాటా నుంచి కొత్త ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు!

వార్త 16 hrs ago

Tata Nexon CAMO Edition: టాటా మోటార్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సరికొత్త 'నెక్సాన్ కామో ఎడిషన్' (Nexon CAMO Edition)ను అందుబాటులోకి తెచ్చింది.

దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ.9.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ పరిమిత కాల స్పెషల్ ఎడిషన్‌ను క్రియేటివ్, అంతకంటే పై వేరియంట్ల ఆధారంగా రూపొందించారు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇంజిన్ ఎంపికలు సాధారణ మోడల్ లాగే కొనసాగుతుండగా.. డిజైన్, టెక్నాలజీ విభాగాల్లో కీలక మార్పులు చేశారు.

ఈ స్పెషల్ ఎడిషన్‌లో ‘మున్నార్ మిస్ట్’, ‘కూర్గ్ క్లౌడ్’ అనే రెండు ఆకర్షణీయమైన కొత్త కలర్ ఆప్షన్లను అందిస్తున్నారు. కారు ప్రత్యేకతను చాటేలా ముందు ఫెండర్లపై ‘CAMO’ బ్యాడ్జింగ్‌ను ఇచ్చారు. క్యాబిన్ అంతర్భాగంలో ముందు సీట్ల హెడ్‌రెస్ట్‌లపై కామో పెర్ఫొరేషన్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Read Also : Strait of Hormuz : హర్ముజ్ జలసంధి పునఃప్రారంభానికి సన్నాహాలు - అంతర్జాతీయ వాణిజ్యానికి ఊరట

 New edition launched by Tata - details on price and features!

Tata Nexon CAMO Edition: అధునాతన టెక్నాలజీ, ఇన్ఫోటైన్‌మెంట్

కారు లోపల ప్రధాన ఆకర్షణగా 12.3 అంగుళాల హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. సాధారణ మోడల్‌లో ఉండే 10.25 అంగుళాల స్క్రీన్ స్థానంలో దీనిని తీసుకొచ్చారు. దీనితో పాటు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ యథావిధిగా అందుబాటులో ఉంటుంది. ప్రయాణాలను సురక్షితంగా రికార్డ్ చేసేందుకు 360 డిగ్రీల కెమెరాతో అనుసంధానమైన ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్‌ను కూడా ఇందులో అందించడం విశేషం.

ఎంచుకునే వేరియంట్‌ను బట్టి పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 9-స్పీకర్ల జేబీఎల్ (JBL) ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. అలాగే టాప్ వేరియంట్లలో 360 డిగ్రీల కెమెరాతో పాటు బ్లైండ్ వ్యూ మానిటరింగ్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లను పొందుపరిచారు.

ఇంజిన్ ఆప్షన్లు, పవర్ పెర్ఫార్మెన్స్

ఇంజిన్ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు లేవు. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 హెచ్‌పీ శక్తి, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 115 హెచ్‌పీ, 260 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇక సీఎన్‌జీ వెర్షన్ 100 హెచ్‌పీ శక్తి, 170 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది. వీటిలో 6-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ (AMT), 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ (DCA) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

స్విగ్గీ బిగ్ టార్గెట్: 2031 నాటికి రూ. 10,000 కోట్ల లాభమే లక్ష్యం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha