Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశ వ్యాప్తంగా నెయ్యి ధరల పెరుగుదలకు కారణాలివే!

దేశ వ్యాప్తంగా నెయ్యి ధరల పెరుగుదలకు కారణాలివే!

వార్త 2 weeks ago

Ghee Price : దేశవ్యాప్తంగా నెయ్యి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నెయ్యి ధరల పెరుగుదల మరో సమస్యగా మారింది.

కొద్ది రోజులుగా ప్రముఖ డెయిరీ కంపెనీలు నెయ్యి ధరలను భారీగా పెంచుతున్నాయి. తాజాగా కర్ణాటకకు చెందిన ప్రముఖ డెయిరీ సంస్థ నందినీ (Nandini) లీటర్ నెయ్యి ప్యాకెట్ ధరను ఒకేసారి రూ.100 పెంచింది. దీంతో గతంలో ఉన్న ధర నుంచి పెరిగి లీటర్ ప్యాకెట్ ధర రూ.850కి చేరింది. పండుగలు, శుభకార్యాల సమయంలో నెయ్యి వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరల పెరుగుదల వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా స్వీట్లు, పిండి వంటలు, సంప్రదాయ ఆహార పదార్థాల తయారీలో నెయ్యి కీలకంగా ఉపయోగిస్తుండటంతో పెరిగిన ధరలు గృహ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

Read ALso ; తల్లి ఆత్మహత్య..మృతదేహం పక్కనే రాత్రంతా ఏడ్చిన చిన్నారి

డిమాండ్ పెరుగుదల.. కల్తీపై FSSAI చర్యలు కూడా కారణమా?

నెయ్యి ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రధానంగా పండుగల సీజన్ నేపథ్యంలో నెయ్యికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. అదే సమయంలో ఆహార భద్రతా ప్రమాణాలను కఠినతరం చేస్తూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) కల్తీ నెయ్యి తయారీ, విక్రయాలపై చర్యలు చేపడుతోంది. నాణ్యమైన నెయ్యి ఉత్పత్తి, సరఫరా విషయంలో ఈ పరిణామాలు ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నెయ్యి ఉత్పత్తికి అవసరమైన పాల కొవ్వు (Milk Fat) నిల్వలు తగ్గిపోవడానికి ఎగుమతులు కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దేశీయంగా డిమాండ్ పెరగడం, అందుబాటులో ఉన్న నిల్వలు తగ్గడం వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. రానున్న రోజుల్లో డిమాండ్, సరఫరా పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై నెయ్యి ధరల భవిష్యత్తు ఆధారపడి ఉండనుంది. ధరలు మరింత పెరుగుతాయా? లేక సరఫరా మెరుగుపడటంతో తగ్గుతాయా? అన్నది వేచి చూడాలి.

దీపావళి టపాసులతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha