Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశాభివృద్ధికి యువత నైపుణ్యమే పునాది

దేశాభివృద్ధికి యువత నైపుణ్యమే పునాది

వార్త 2 weeks ago

Youth skills : ప్రపంచంలోని 8.2 బిలియన్ల జనాభాలో 15 నుంచి 24 ఏండ్ల వయస్సు కలిగిన యువత జనాభా1.22 బిలియన్లు (దాదాపు 15.4 శాతం) ఉన్నారు. అదే విధం గా ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 64 ఏండ్ల వయస్సు కలిగిన పని చేసే లేదా వర్కింగ్ క్లాస్ జనాభా 78 శాతం అనగా 6.4 బిలియన్లు ఉన్నారు.

నేడు భారత జనాభా 1.46 బిలియన్లు ఉన్నది. ఇందులో 15 నుంచి 29 ఏండ్ల యువత జనాభా 40శాతం వరకు ఉన్నది. మన దేశంలో 15 నుంచి 64 ఏండ్ల వయస్సు కలిగిన పని చేసే లేదా వర్కింగ్ క్లాస్ జనాభా 96.1కోట్లు (లేదా 0.961 బిలియ న్లు), అనగా 68 శాతం వరకు ఉన్నది. ఇండియాలో 15 ఏండ్లలోపు జనాభా 24 శాతం, 64 ఏండ్లు దాటిన వారి జనాభా 7శాతం వరకు ఉన్నది. ఇతర దేశాలతో పోల్చితే భారత జనాభా సగటు వయస్సు చాలా తక్కువగా 28.8 ఏండ్లు మాత్రమే ఉన్నది. జపాన్ ప్రజల సగటు వయస్సు 49.9 ఏండ్లు ఉన్నది. అందువల్లనే ‘ఇండియాను యువ భారత్’ అని, జపాన్ను ‘ఓల్డ్ జపాన్’ అని పిలుస్తున్నాం.

 Youth skills

Youth skills : నైపుణ్య యువత మాత్రమే పునాది

యువ జనాభా అధికంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో విశ్వదేశాల్లో భారత్ ముందుండి తన సత్తాను గట్టిగా చాటుకోనున్నది. యువత అధికంగా ఉండడంతో పాటు ఆ యువత నైపుణ్య విద్యను పొందితే భారత భవిత ఉజ్వ లంగా ఉండనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక యువ జనాభా కలిగిన యువ భారతాన్ని పలు నవాళ్లు కూడా వెంటాడు తున్నాయి. నేడు పరిశ్రమ ఆశిస్తు న్న నైపుణ్యాలకు, నేటి మన యువత కలిగి ఉన్న నైపు ణ్యాలకు మధ్య వ్యత్యాసం లేదా గ్యాప్ అధికంగా ఉండ డంతో మన యువశక్తి దేశాభివృద్ధికి అంతగా వినియోగ పడడం లేదు. యువతలో అవసర నైపుణ్యాలు కొరవడితే నిరుద్యోగం పెరగడం, తక్కువస్థాయి ఉ ద్యోగాలు చేయడం లాంటి ప్రతికూల ఫలితాలు వెక్కిరిస్తున్నాయి. తగిన నైపు ణ్యాలు లేని యువతతో నిరుద్యోగసమస్యలు పెరిగి సమ్మి ళిత ఆర్ధిక అభివృద్ధి, సమానత్వ భావనలు పలుచబడతా యి. పౌర సమాజ సుస్థిరాభివృద్ధికి, ఆరోగ్యకర సమాజ స్థాపనకు నైపుణ్య యువత మాత్రమే పునాది అవుతారు. బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్సీలు) లేదా పరిశ్రమలు కోరుతున్న నైపుణ్యాలను నేటి విద్యాలయాలు బోధిస్తూ, తగు శిక్షణలు ఇవ్వాలి.

 Youth skills

యువశక్తి దేశానికి వరంగా ..

నేడు ప్రపంచం 4వ పారిశ్రామిక విప్లవం సాకారం కావడానికి ‘ఏఐ, సాంకేతిక, వృత్తి విద్య శిక్షణ’ రంగాలు నడుం బిగిస్తే నేటి యువత రేపటి పరి శ్రమలో పనిచేయడానికి సిద్ధం అవుతారు. నేడు ఏఐరంగం ప్రపంచాన్ని శాసిస్తున్నది. మన జీవితాలు, లెర్నింగ్, చేసే పనులను ఏఐ నిర్ణయించనున్నది. పరిశ్రమ కోరుకున్న నైపుణ్యాల్లో మాత్రమే మన యువతను సదాసిద్ధంచేయాలి. నైపుణ్య యువతతో సమాజ శాంతి, సమ్మిళిత సుస్థిరాభి వృద్ధి సుసాధ్యం అవుతాయని నేటి విద్యాలయాలు, ప్రభు త్వాలు, యువత, పౌర సమాజం, పాలసీ తయారు చేసే వారు గట్టిగా నమ్మాల్సిన అగత్యం ఏర్పడింది. ఉత్తమవృత్తి శిక్షణ, ఏఐ నైపుణ్యాల్లో వృద్ధి, డిజిటల్ సాధికారత వంటి అంశాల్లో యువత దృష్టి పెట్టాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన చదువులు కొనసాగాలి. ఉత్తమ శ్రేణి బోధనలు, అవసర మౌలిక వసతులు, నైపుణ్యాల వృద్ధికి తగిన నిధులను వెచ్చించడం, నాణ్యమైన విద్యా బోధనలు నేటి తక్షణ కర్తవ్యం అని మరువరాదు. నేటి యువతనాణ్య మైన నైపుణ్య విద్యను పొందితే మన యువశక్తి దేశానికి వరంగా మారుతుంది. యువతలో నైపుణ్యాలు కొరవడితే యువశక్తి శాపంగా మారి, అశాంతికి ఆజ్యం పోస్తుంది. మన యువతను నైపుణ్య శక్తిగా మార్చుదాం.

-బి. మధుపాళి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

బ్రెయిన్ డ్రెయిన్ తప్పదా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha