Patriotism : దేశాన్ని ప్రేమించడం అనే భావన ప్రతి పౌరుడిలో ఉండా ల్సిన గొప్ప విలువ, అయితే దేశభక్తి (పేట్రియాటిజం) జాతీయవాదం (రేషనలిజం) ఒకటే కావు.
ఈ రెండింటిని ఉద్దేశపూర్వకంగా కలిపివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రజాస్వామ్య సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో కూడా గత కొన్నేళ్లుగా ‘ప్రభుత్వా న్ని విమర్శిస్తే దేశద్రోహి’, ప్రశ్నిస్తే ‘దేశ వ్యతిరేకి’ అనే రాజ కీయ సంస్కృతి పెరిగిందనే విమర్శలు పెరిగాయి. ఇక్కడ దేశభక్తి ఎక్కడ ప్రారంభమౌతుంది. ఎక్కడ ముగుస్తుంది? జాతీయవాదం ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడ ముగు స్తుంది? అనే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. దేశభక్తి అంటే దేశాన్ని ప్రేమించడం, ప్రజల సంక్షేమాన్ని కోరుకోవడం, రాజ్యాంగ విలువలను గౌరవించడం. దేశభక్తి కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. తప్పులను విమర్శిస్తాడు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాడు. సక్రమంగా పన్నులు చెల్లిస్తాడు. పర్యావరణాన్ని పరిరక్షిస్తాడు. పౌర హక్కులను గౌరవిస్తాడు. మ హాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ వంటివారు దేశాన్ని ప్రేమించారు. కానీ ప్రభుత్వాలను, విధానాలను ప్రశ్నించారు, విమర్శలను స్వీక రించారు.
Patriotism
Patriotism : దేశభక్తి ప్రేమ ఆధారంగా ఉంటుంది
జాతీయవాదం అనేది దేశం లేదా జాతి అత్యున్న తమని భావించేది రాజకీయ సిద్ధాంతం. ప్రభుత్వమే దేశ మని, పార్టీనే దేశమని, నాయకుడే దేశమని చెప్పి విమర్శ ను దేశద్రోహంగా చిత్రీకరిస్తారు. జార్జ్ ఆర్వెల్ మాటల్లో దేశభక్తి ప్రేమ ఆధారంగా ఉంటుంది, జాతీయవాదం అధి కారం ఆధారంగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల అనుభవాలు మనకు సుపరిచితమే. ఉదాహరణకు హిట్లర్ జర్మనీని ప్రపంచంలో అత్యున్నత జాతిగా ప్రకటించాడు. ఫలితంగా ప్రజ అస్వామ్యం పతనం, మీడియా నియంత్రణకు లోనైంది. మైనారిటీలపై దాడులు పెరిగాయి, రెండవ ప్రపంచ యుద్ధం లో లక్షలాది ప్రాణనష్టమును మిగిల్చింది. అత్యుత్సాహ జాతీయవాదం ఎంత ప్రమాదకరమో తెలియజేసింది. అలాగే ఇటలీలో ముస్సోలిని దేశభక్తిని జాతీయవాదంగా మార్చి ఫాసిస్టు పాలన నిర్మించాడు. ప్రజాస్వామ్యం బల హీనపడింది. ఇక ప్రస్తుతం అమెరికాలో ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం కొంతమందికి దేశభక్తిగా కనిపించినా, విమ ర్శకుల ద ష్టిలో అది అధిక జాతీయవాద రాజకీయాలకు దారి తీసింది. ఇక మన దేశంలో స్వాతంత్ర్య పోరాటంలో జాతీయవాదం బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఒక విముక్తి ఉద్యమం జరిగింది.
జాతీయవాదం రూపం మారింది
కానీ నేడు జాతీయవాదం రూపం మారింది. ఇక్కడ ప్రస్తుతం నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దేశద్రోహులౌతాము, పేవర్లు లీకయితే, పర్యావరణ నాశ నంపై మాట్లాడితే దేశ వ్యతిరేకులౌతాము, ఎన్నికల వ్యవస్థపై సందేహాలు వ్యక్తం చేస్తే దేశానికి శత్రువులమవుతాము. ప్రజా స్వామ్యంలో ఇవన్నీ సహజమైన ప్రశ్నలు. ప్రస్తుత జాతీయ వాద రాజకీయాలు విమర్శకుల అభిప్రాయం ప్రకారం రాజ కీయాల్లో జాతీయవాదం ప్రధాన ఎన్నికల వ్యూహంగా మా ఉంది. ఉదాహరణకు సైన్య విజయాల రాజకీయీకరణ ఆరో పణలు, మతపరమైన గుర్తింపుతో దేశభక్తిని అనుసంధానం చేయడం, విభేదించే స్వరాలను ‘అర్బన్ నర్సల్’, ‘దేశద్రోహి’ గా ముద్రించడం అనే విమర్శలు పెరిగాయి. మీడియాద్వారా భావోద్వేగ జాతీయవాద ప్రచారాన్ని ఉధృతం చేయడం పెరిగింది. అందువల్ల ఈ అంశాన్ని వివిధ కోణాల నుండి పరిశీలించడం అవసరం. డాక్టర్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం దేశానికంటే రాజ్యాంగ విలువలు (సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, న్యాయం) ముఖ్యమైనవని, దేశాన్ని ప్రేమించడం అంటే ఈవిలువలను కాపాడటమని, జెండాకు సెల్యూట్ చేయడం మాత్రమే దేశభక్తి కాదని, ఆకలితో ఉన్న పౌరుడికి ఆహారం అందించడం. విద్యను అందించడం, అడవులను రక్షించడం, అవినీతిని ప్రశ్నించడం కూడా దేశ భక్తి అవుతుందని చెప్పారు.
దేశభక్తి అంటే..
దేశభక్తి అంటే జరిగే అన్యాయా లను, తప్పులను చూసిగుండెల్లో మంటలు రేగాలి, ప్రశ్నించా లి. పోరాడాలి. కానీ దేశం నిజంగా ఎంత అభివృద్ధి చెం దిందో, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో. ఎంత స్వేచ్ఛ గా జీవిస్తున్నారో కొలవడానికి ప్రపం చవ్యాప్తంగా అనేక సూచీలు ఉన్నాయి. ఉదాహరణకు వివిధ రకాల సూచీలను చుస్తే ఆకలి సూచీలో (గ్లోబల్ హంగర్ ఇండెక్స్) నివేదికలో 123 దేశాలకుగాను భారత్ 102వ స్థానంలో (పిల్లల పోష కాహార లోపం, రక్తహీనత, శిశుమరణాలు వంటి సమస్యలు కొనసాగుతున్నాయి). ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ విడుదల చేసిన 2026 సంవత్సరానికిగాను ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచికలో 180 దేశాలలో భారత్ 157వ స్థానంలోను, 2026గాను ప్రపంచ సంతోష సూచికలో 147 దేశాలలో భారత్ 116వ స్థానంలోను, అవినీతి అవగాహన సూచికలో 182 దేశాలలో భారత్ 91వ స్థానంలోను, వాతావరణ మార్పుల పనితీరు సూచిక 2026లో పరిశీలించిన 67 దేశాలలో భారత్ మొత్తంమీద 23వ స్థానంలోనునిలిచింది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వారి మానవ అభి వృద్ధి సూచికలో 193 దేశాలలో భారత్ 130వస్థానంలోను, తాజాగా ‘మహిళలు, శాంతి, భద్రత సూచికలో ప్రపంచవ్యా ప్తంగా 181 దేశాలలో భారత్ 131వ స్థానంలో, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వశాఖ ఇటీవలి గణాంకాల ప్రకారం గత మూడేళ్ల కాలంలో జాతీయ రహదారులపై మొత్తం 21 వంతెనలు (15 పూర్త యినవి 6 నిర్మాణంలో ఉన్నవి) కూలిపోయాయి.
Patriotism
నాయకుడిని ప్రశ్నించడం దేశ ద్రోహంకాదు
విస్తృత కోణంలో చూస్తే గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వందలాది వంతెనలు రహదారి మౌలిక సదుపాయాలు కూలిపోయి నట్లు సోషల్ మీడియా విశ్లేషణలు, నిర్మాణ సంబంధిత సమాచారం అంచనా వేస్తు న్నాయి. వీడెమ్ ఇన్స్టిట్యూట్ లిబరల్ డెమోక్రసీ ఇండెక్స్ ప్రకారం సూచీ ప్రకారం భారతదేశం ‘ఎలక్టోరల్ ఆటోక్రసీ’ (ఎన్నికల నిరం కుశత్వం) దేశంగా వర్గీకరించబడింది. ఎక నామిస్ట్ ఇంటెలి జెన్స్ యూనిట్ (ఈ.ఐ. యూ) డెమోక్రసీ ఇండెక్స్ ప్రకారం భారతదేశాన్ని ‘పాక్షిక లోపాలు గల ప్రజా స్వామ్య’ దేశంగా వర్గీకరించారు. నిజమైన దేశభక్తి ఈ సూచీలను చూసి దేశాన్ని మెరుగుపరచుకోవాలని కోరుతుం ది. అతి జాతీయవాదం మాత్రం ఈసూచీలను పట్టించుకో కుండా ‘విశ్వగురువు’ అనే ప్రచారానికే పరిమితం అయ్యే ప్రమాదం ఉంది. డోనాల్డ్ ట్రంప్ మన దేశ ప్రతిష్టను, అంతర్గత వ్యవహారాలను, ఎగుమతులపై పన్ను పెంపు, పెట్రోల్ రష్యాదగ్గర కొనగూడదు అని ఇలా చాలారకాలుగా వ్యవహరించినా మనవిశ్వగురువు ఏమి జరగనట్టు వ్యవహ దిస్తున్నారు. దేశభక్తి ప్రజాస్వామ్యా న్ని బలపరుస్తుంది, అతి జాతీయవాదం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచే ప్రమాదం కలిగి ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రేమించడం దేశభక్తి కాదు, దేశాన్ని ప్రేమించడం దేశభక్తి. నాయకుడిని ప్రశ్నించడం దేశ ద్రోహంకాదు, ప్రజాస్వామ్య బాధ్యత. దేశభక్తి ‘నా దేశం గొప్పది’ అని చెప్పడం మాత్రమే కాదు.’నా దేశం మరింత న్యాయంగా, సమానంగా, ప్రజాస్వామ్యంగా మారాలి’ అని కోరుకోవడమే నిజమైన దేశభక్తి..
-డా. ఎ. భాగ్యరాజ్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

