Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశంలో గూగుల్ క్లౌడ్ సేవలు డౌన్

దేశంలో గూగుల్ క్లౌడ్ సేవలు డౌన్

వార్త 4 days ago

Google Cloud Down: భారతదేశంలోని ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబయి, చెన్నై వంటి ప్రముఖ మహానగరాల్లో గూగుల్ క్లౌడ్ (Google Cloud) సేవలకు భారీ అంతరాయం (Outage) ఏర్పడింది.

ఢిల్లీలోని గూగుల్ క్లౌడ్ సేవలను హోస్ట్ చేస్తున్న ఒక ప్రముఖ థర్డ్-పార్టీ డేటా సెంటర్ (Data Center) లో అకస్మాత్తుగా సంభవించిన ఘోర అగ్నిప్రమాదమే దీనికి ప్రధాన కారణమని టెక్ వర్గాలు వెల్లడించాయి. ఈ సాంకేతిక లోపం కారణంగా గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవలను ఉపయోగించే పలు కార్పొరేట్ కంపెనీలు, వెబ్‌సైట్లు మరియు డిజిటల్ అప్లికేషన్ల నిర్వహణ తాత్కాలికంగా స్తంభించిపోయింది.

Read also:AI CRM : ఏఐ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి.. సేల్స్‌ఫోర్స్ 'ట్రైల్‌హెడ్' నైపుణ్య విప్లవం

డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం - పవర్ కట్

 Major Outage in Delhi, Mumbai & Chennai After Fire at Data Center

గూగుల్ క్లౌడ్ ఆసియా-పసిఫిక్ (సౌత్) రీజియన్‌కు అనుసంధానంగా ఉన్న ఢిల్లీలోని థర్డ్ పార్టీ డేటా సెంటర్ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం తీవ్రత దృష్ట్యా.. మంటలు మరింత వ్యాపించకుండా మరియు భారీ డేటా సర్వర్లు దెబ్బతినకుండా ఉండేందుకు అధికారులు ముందుజాగ్రత్తగా నెట్‌వర్కింగ్ పరికరాలకు (Networking Equipment) విద్యుత్ సరఫరాను (Power Supply) పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీ సెంటర్‌లో పవర్ కట్ అవ్వడంతో ఆ సిగ్నల్స్ ఆధారంగా అనుసంధానమై ఉన్న ముంబయి, చెన్నై లోని ప్రధాన గూగుల్ క్లౌడ్ జోన్లపై కూడా దీని ప్రభావం పడింది. దీంతో ఆయా రీజియన్లలో క్లౌడ్ హోస్టింగ్ సర్వీసులు డౌన్ అయ్యాయి.

Google Cloud Down: గూగుల్ తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు - ట్రాఫిక్ మళ్లింపు

ఈ క్లౌడ్ అవుటేజ్‌పై గూగుల్ సాంకేతిక బృందం (Google Cloud Support Team) తక్షణమే స్పందించింది. "ఢిల్లీలోని థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వల్ల సర్వీసులకు అంతరాయం కలిగిన మాట వాస్తవమే. అయితే వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. మేము యుద్ధప్రాతిపదికన సదరు డేటా సెంటర్ నుండి వచ్చే పూర్తి నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను వేరే సురక్షిత మార్గాలకు (Alternative Cloud Zones/Regions) మళ్లించాము" అని గూగుల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం సేవలు పునరుద్ధరణ దశలో ఉన్నాయని టెక్ దిగ్గజం తెలిపింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha