UPI without internet: నేటి కాలంలో డిజిటల్ చెల్లింపులు అందరికీ అవసరంగా మారాయి. చాలామందికి ఇంటర్నెట్ లేని సమయంలో లావాదేవీలు ఎలా చేయాలో తెలియదు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు చేసుకునే సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్ ఉంటే చాలు, ఎక్కడి నుండైనా క్షణాల్లో నగదు బదిలీ చేయవచ్చు. ఈ పద్ధతి చాలా సురక్షితమైనది అలాగే ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ఉంటుంది.
Read also: Xiaomi : షావోమి నుండి ఫ్లాగ్‌షిప్ మోడల్
UPI transactions without the internet
ఈ సేవకు కావలసిన ప్రాథమిక అర్హతలు
ఈ సదుపాయం పొందడానికి మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాతో అనుసంధానం అయి ఉండాలి. మీ బ్యాంక్ ఖాతాలో UPI సేవలు అప్పటికే యాక్టివేట్ చేసి ఉండటం చాలా ముఖ్యం. అలాగే మీ ఫోన్‌లో కాల్స్, SMS సేవలు సజావుగా పనిచేయాలి. స్మార్ట్‌ఫోన్ లేకపోయినా సరే సాధారణ కీప్యాడ్ ఫోన్‌లతో కూడా ఈ సేవలను మీరు వినియోగించుకోవచ్చు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి చాలా ఉపయోగకరమైన మార్గం.
UPI without internet: నగదు బదిలీ ప్రక్రియ ఎలా ఉంటుంది
మొబైల్ డయలర్ ఓపెన్ చేసి *99# అని టైప్ చేసి కాల్ చేయాలి. స్క్రీన్ మీద మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి, అందులో మనీ పంపడానికి మొదటి ఆప్షన్ ఎంచుకోవాలి. ఎవరికి డబ్బు పంపాలో వారి నంబర్ లేదా UPI ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న అమౌంట్ ఎంటర్ చేసి మీ UPI పిన్ నంబర్ ఇవ్వాలి. వెంటనే మీ ఖాతా నుండి నగదు బదిలీ అవుతుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

