Hardeep Singh Puri tweet: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ కొరత ఉందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
దీనివల్ల మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు.
Read also: Jogi Ramesh: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

News of a Nationwide Lockdown: Union Minister Issues Clarification
Hardeep Singh Puri tweet: కేంద్ర మంత్రి పూరి స్పష్టత
ఈ ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశంలో లాక్‌డౌన్ విధించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదంతా అసత్య ప్రచారమని, ఇంధన నిల్వలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
సంక్షోభ సమయాల్లో ప్రజలు ప్రశాంతంగా మరియు ఐకమత్యంగా ఉండటం చాలా అవసరమని మంత్రి గుర్తు చేశారు. పెట్రోల్, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది . తప్పుడు వార్తలను నమ్మి భయాందోళనలకు గురికావద్దని, బాధ్యతాయుతమైన పౌరులుగా సహకరించాలని ఆయన కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

