HDBC : దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన 'హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్' తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్‌ఆర్) ప్రతిష్టాత్మక కార్యక్రమం 'పరివర్తన్' ద్వారా దేశవ్యాప్తంగా 10.77 కోట్ల మంది ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చింది.
ఇటీవల విడుదల చేసిన సమీకృత వార్షిక నివేదిక ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం (2025-26)లోనే సిఎస్‌ఆర్ కార్యకలాపాల కోసం ఏకంగా రూ. 1,316.18 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటివరకు సంస్థ చేసిన మొత్తం సిఎస్‌ఆర్ పెట్టుబడి రూ. 7,492 కోట్లకు చేరింది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్న ఈ బృహత్తర ప్రాజెక్ట్ కింద స్థానిక పరిపాలనా సంస్థలు, ఎన్‌జిఓల భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన దిశగా శాశ్వత అభివృద్ధి పనులను బ్యాంక్ వేగవంతం చేస్తోంది.

11,000 గ్రామాలకు 'సమగ్ర వికాసం': ఆరు కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేపట్టిన 'సమగ్ర గ్రామీణాభివృద్ధి కార్యక్రమం' (హెచ్‌ఆర్‌డీపీ) ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,000 పైగా గ్రామాలకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ 'వైబ్రంట్ విలేజెస్' ప్రణాళికలో భాగంగా సరిహద్దు ప్రాంతాలలోని 498 గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందిస్తోంది. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDGs) అనుగుణంగా… గ్రామీణాభివృద్ధి, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ-ఉపాధి, ఆరోగ్యం-పరిశుభ్రత, ఆర్థిక అక్షరాస్యత మరియు సహజ వనరుల యాజమాన్యం అనే ఆరు ప్రధాన విభాగాలలో ఈ నిధులను వెచ్చిస్తున్నారు. 36,300 కంటే ఎక్కువ విద్యార్థి వేతనాలు అందించడంతో పాటు 16,000 కి పైగా నీటి సంరక్షణ నిర్మాణాలు, 9.6 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి సుస్థిర ప్రగతికి బ్యాంక్ ప్రాతిపదికగా నిలిచింది.
J&K సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు మంజూరు చేసిన సుప్రీంకోర్టు!

