ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వెల్లడి
Indian Bureau of Mines: దేశ వ్యాప్తంగా ఉన్న గనుల సంబంధిత ఆదాయం రాష్ట్రాలకే చెందుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఖనిజాల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయడం, వాటి ద్వారా వచ్చే ఆదాయాలను వసూలు చేయడం అనే అంశాలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ తెలిపింది.
Read Also: Air India: భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత
a total of 2,642 mines across the country, 1,374 mines have closed.
Indian Bureau of Mines: ప్రభుత్వ, ప్రైవేటు గనుల వివరాలు
బ్యూరో ఆఫ్ మైన్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా సమకూరిన ఆదాయ వివరాలను చూస్తే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వం ఆధీనంలో 234 గనులు కంపెనీలు ఉండగా, ప్రైవేటు వ్యక్తుల చేతిలో 2,408 ఉన్నాయి. ప్రభుత్వం ఆధీనంలో ఎక్కువగా ఒడిశాలో 48, మధ్యప్రదేశ్లో 29, కర్నాటకలో 27 ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇక ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎక్కువగా మధ్యప్రదేశ్లో 431, తమిళనాడు 400, గుజరాత్లో 306 కంపెనీలు ఉన్నాయని పేర్కొంది.
గనులు మూతపడటానికి కారణాలు
కాగా దేశ వ్యాప్తంగా పలు గనులు దశల వారీగా మూతపడుతున్నాయి. ప్రస్తుతం గనులు పనిచేయక పోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయని వెల్లడించింది. ప్రధానంగా వాటికి చట్టపరమైన అనుమతులు లభించకపోవడంతో పాటు, వాటి నిబంధనలను పాటించలేదు. అంతేకాకుండా తగిన నాణ్యత గల ఖనిజం లభించకపోవడం, ఆర్థికంగా లాభదాయకం కాని కార్యకలాపాలు, కోర్టు కేసులు, వివాదాలు నడుస్తున్నాయి. గనుల బ్లాకులు పర్యావరణ సున్నిత ప్రాంతాలు కానీ నోటిఫై చేయబడిన వన్యప్రాణి, పులుల కారిడార్ల పరిధిలోకి రావడం, భూసేకరణ, స్థానిక సమస్యలు వంటి ఇతర అంశాలతో దేశంలోని పలు గనులు మూత పడ్డాయి. దేశవ్యాప్తంగా మినరల్స్ 2,642 గనులు ఉండగా, అందులో 1,268 పనిచేస్తుండగా, మరో 1,374 మూతపడినట్లు బ్యూరో ఆఫ్ మైన్స్ పేర్కొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

