Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

పనిమనిషి కాదు మహారాణి.. ఎస్డీపీఓ ఇంట్లో సోదాల్లో విస్తుపోయే నిజాలు!

వార్త 2 months ago

Bihar SDPO Raid: బీహార్‌లోని కిషన్‌గంజ్ ఎస్డీపీఓ (SDPO) గౌతమ్ కుమార్ నివాసాలపై జరిగిన ఆర్థిక నేరాల విభాగం (EOU) దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ కేసులో పనిమనిషి ‘పారో’ జీవనశైలి మరియు ఆమె ఆస్తుల వివరాలు చూసి దర్యాప్తు అధికారులే నోరెళ్లబెట్టారు. ఒక సాధారణ పనిమనిషికి కోటి రూపాయల బంగళా, విలాసవంతమైన కార్లు ఉండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

Read Also:Patna child crime : నిద్రిస్తున్న మేనకోడలిని ఎత్తుకెళ్లి దారుణం

ఆదాయానికి మించి 60 శాతం ఆస్తులు

32 ఏళ్ల సర్వీసులో ఉన్న గౌతమ్ కుమార్, తన అధికార దుర్వినియోగంతో దాదాపు 80 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మార్చి 31న జరిగిన దాడుల్లో అధికారులు షాకింగ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.పూర్ణియాలో 4 అంతస్తుల మేడ, సిలిగురిలో టీ ఎస్టేట్లు, నోయిడా ,గుర్గావ్‌లో ఖరీదైన ఫ్లాట్లు.36 భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, భారీగా బంగారం, వెండి ఆభరణాలు ,విలాసవంతమైన కార్లు.

 SDPO Gautam Kumar EOU Raid Bihar

ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ ఇంట్లో పనిచేసే పారో అనే మహిళకు పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగళా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేవలం ఇల్లు మాత్రమే కాదు, ఆమె రోజువారీ జీవనశైలి కూడా చాలా విలాసవంతంగా ఉండేది. ఆమె రోజుకు 35 లక్షల రూపాయల విలువైన ‘థార్’ కారులో పనికి వచ్చేదని, కొన్నిసార్లు ఎస్డీపీఓ ప్రభుత్వ వాహనంలోనే ఆమెను తీసుకువచ్చేవారని సమాచారం. గౌతమ్ కుమార్ ఆమెకు ఒక ‘బుల్లెట్’ బైక్‌ను కూడా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

Bihar SDPO Raid :సోషల్ మీడియా స్టార్

పారో ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షన్నర నగదుతో రీల్స్ చేస్తూ, బుల్లెట్ బైక్‌పై చక్కర్లు కొడుతూ కనిపించేది. ఎస్డీపీఓ, ఆయన స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే సోదాల వార్త తెలియగానే ఆమె తన అకౌంట్‌ను లాక్ చేసి, కుటుంబంతో సహా పరారైనట్లు తెలుస్తోంది.మార్చి 31న గౌతమ్ కుమార్ నివాసాల్లో జరిగిన సోదాల్లో 36 భూములకు సంబంధించిన పత్రాలు, బంగారు, వెండి ఆభరణాలు, ఖరీదైన వాచీలు ,విలాసవంతమైన కార్ల కాగితాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్ణియాలో నాలుగు అంతస్తుల మేడ, సిలిగురిలో తేయాకు తోటలు, నోయిడా మరియు గుర్గావ్‌లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి గౌతమ్ కుమార్‌ను పదవి నుండి తొలగించి, హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నకిలీ బాబా కేసులో రాజకీయ తుఫాన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha