Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నెంబర్.. సుప్రీం ఆదేశం

దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్‌లైన్ నెంబర్.. సుప్రీం ఆదేశం

వార్త 3 weeks ago

112 helpline : త్వరలో దేశవ్యాప్తంగా అందరికీ, అన్నింటికీ ఒకే హెల్ప్‌లైన్‌ నెంబర్ అమలులోకి రాబోతుంది. 112 నెంబర్‌ను దేశవ్యాప్తంగా, ఎమర్జెన్సీ నెంబర్‌గా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.

మూడు నెలల్లోగా ఈ నెంబర్ అమలయ్యేలాగా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాలకు సూచించింది. సేవ్ లైఫ్ ఫౌండేషన్ అనే రోడ్ సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Read Also : HC Judgment Delays: 'రిజర్వ్ చేసిన తీర్పులు 3 నెలల్లోపు వెలువరించాలి': హైకోర్టులకు సుప్రీంకోర్టు డెడ్‌లైన్!

 112 helpline

112 helpline :అన్నింటికీ కలిపి ఒకే ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్

జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని సుప్రీం బెంచ్ దీనిపై విచారణ జరిపి, ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఎమర్జెన్సీ నెంబర్లు అమలులో ఉన్నాయి. పోలీసులకు 100, ఫైర్ సర్వీసెస్ కోసం 101, అంబులెన్స్‌ల కోసం 102, 108, హైవేలపై సహాయం కోసం 1033, మహిళల భద్రత కోసం 1091 నెంబర్లు దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. అయితే, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వీరిలో ఏ నెంబర్‌కు చేయాల అనే విషయంలో చాలా మంది గందరగోళానికి గురవుతున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అందాల్సిన సహాయం అందడం లేదు అందుకే అన్నింటికీ కలిపి ఒకే ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ ఉంటే బాగుటుందని సేవ్ లైఫ్ సంస్త కోరింది.

 112 helpline

ప్రతి నిమిషం కూడా ముఖ్యమే

ఈ నేపథ్యంలో అన్నింటినీ కలిపి ఒకే నెంబర్‌గా 112 అమలు చేయాలని కేంద్రం సూచించింది. కోర్టు వ్యాఖ్యల ప్రకారం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరూ అత్యవసర వైద్య సేవలు పొందే హక్కు కలిగి ఉన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన పరిస్తితుల్లో ప్రతి నిమిషం కూడా ముఖ్యమేనని, బాధితుల పరిస్తితి క్షణాల్లోనే విషమించే అవకాశం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అత్యవసర సేవలు ఆలస్యమైతే బాధితుల్ని కాపాడటం కష్టమవుతుందని కోర్టు అభిప్రాయపడింది. త్వరగా స్పందిస్తే బాధితుల్ని కాపాడవచ్చని తెలిపింది. అందువల్ల ప్రభుత్వాలు మూడు నెలల్లోగా 112 నెంబర్‌ను పూర్తిస్థాయిలో అమలులోకి తేవాలని ఆదేశించింది. దీనిపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని సూచించింది. రోడ్డు ప్రమాదాల్లో సేవలందించేందుకు జాతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాలకు సూచించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

భారత మైనింగ్ రంగం రికార్డు.. ఒక్క ఏడాదిలోనే 212 ఖనిజ బ్లాకుల వేలం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha