Dailyhunt
దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల విస్తరణ: టీటీడీ భారీ ప్రణాళిక

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల విస్తరణ: టీటీడీ భారీ ప్రణాళిక

వార్త 2 weeks ago

TTD New Temples: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని మరియు ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒక భారీ ప్రణాళికను రూపొందించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు మరియు ప్రధాన నగరాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. భక్తులకు తమ ప్రాంతాల్లోనే స్వామివారిని దర్శించుకునే వీలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీని కోసం టీటీడీ ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి స్థల కేటాయింపులను కోరింది.

Read Also:TTD Anna Prasadam: తిరుమల అన్న ప్రసాదానికి భక్తుల రద్దీ.. ఎందుకంటే?

TTD New Temples: అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకన్న గుడులు

 The Navi Mumbai Srivari Temple is set to open in June.

ప్రస్తుతం మహారాష్ట్రలోని నవీ ముంబయిలో ఉన్న ఉల్వేలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోంది. రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా విరాళంతో నిర్మిస్తున్న ఈ ఆలయం ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేసుకుంది. జూన్ నెలలో ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక ప్రముఖ రియల్టర్ సంస్థ 19.62 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చింది. ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అక్కడ అద్భుతమైన ఆలయ నిర్మాణ పనులను టీటీడీ ప్రారంభించనుంది.

వివిధ రాష్ట్రాల్లో ఆలయ నిర్మాణాల పురోగతి

ఈ ఆధ్యాత్మిక యాత్ర ఈశాన్య రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో 10.32 ఎకరాల భూమిని అక్కడి ప్రభుత్వం టీటీడీకి కేటాయించింది. అలాగే కర్ణాటకలోని బెలగావిలో బెలగావిరెడ్డి సంఘం ఇచ్చిన 7 ఎకరాల స్థలంలో ‘శ్రీవాణి’ ట్రస్ట్ నిధులతో ఆలయ నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు విజ్ఞప్తికి స్పందించిన బీహార్ ప్రభుత్వం, పాట్నా జిల్లాలో 10.11 ఎకరాల భూమిని 99 సంవత్సరాల పాటు కేవలం ఒక రూపాయి నామమాత్రపు లీజుకే కేటాయించేందుకు అంగీకరించింది. ఇలా దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో తిరుమల తరహా ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకురావడానికి టీటీడీ వడివడిగా అడుగులు వేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆగమోక్తంగా ప్రారంభమైన చైత్రమాస కల్యాణ బ్రహ్మోత్సవాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha