Dailyhunt
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ పొడిగింపు

వార్త 2 days ago

AC Shanti Case: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ ముగిసింది.అధికారులు శాంతిని విజయవాడ ఎసిబి కోర్టులో హాజరుపరచగా, శాంతి రిమాండ్ ఈ నెల 19కి పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

అనంతరం అధికారులు శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని శాంతి విజయవాడ, గుంటూరుల్లోని శాంతి ఇళ్లలో తనిఖీ చేసిన ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు.

Read also: AP High Court : ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు

 AC Shanti Remand Extension News Update

AC Shanti Case: ఆస్తుల కేసులో వీడని చిక్కులు

కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ఇక ఈ కేసులో ఎసిబి ఇప్పటికి శాంతిని రెండు పర్యాయాలు కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో తన ఆస్తులు సక్రమమని వాదించినట్లు అధికారులు తెలిపారు. మరో పక్క శాంతి బెయిల్ పిటిషన్ ఇటీవల కోర్టు తిరస్కరించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha