Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం సరికాదు: వైఎస్సార్సీపీ తీరుపై చంద్రబాబు ధ్వజం

దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం సరికాదు: వైఎస్సార్సీపీ తీరుపై చంద్రబాబు ధ్వజం

వార్త 1 month ago

CM Chandrababu : శాసనసభ లాబీలో మీడియాతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్సీపీ బహిష్కరణ నిర్ణయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన అసెంబ్లీ వేదికను ఏకంగా ఒక పార్టీ మొత్తం బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు.

Read Also: World Photography Day: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్‌గా మారిన సీఎం చంద్రబాబు


CM Chandrababu

CM Chandrababu : ముఖ్యమంత్రి మాట్లాడిన ప్రధాన అంశాలు

ప్రజలు తమ సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తారనే నమ్మకంతో ప్రతినిధులను ఎన్నుకుంటారని, సభ వెలుపల కూర్చుని ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదని చంద్రబాబు అన్నారు. 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి ఇద్దరే ఉన్నా సభను సమర్థవంతంగా నడిపించారని తెలిపారు. 1989-94లో ఎన్టీఆర్ కొన్ని రోజులు రాకపోయినా, 2019-24లో తాను సవాల్ చేసి బయటకు వచ్చినా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ప్రజాసమస్యలపై పోరాడారని వివరించారు. గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్సీపీ నేతలు సభకు రాకుండా బయట ఉంటూ మెగా డీఎస్సీ (Mega DSC) పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం కోత విధించిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని, ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని సీఎం తెలిపారు.

శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఆందోళన

మరోవైపు మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు శాసనమండలిలో ఆందోళన చేపట్టడంతో మూడో రోజు కూడా సభకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్సీపీ సభ్యుల వైఖరిపై మంత్రులు కొలుసు పార్థసారధి, నాదేండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షికి ఊరట: ఒక కేసులో బెయిల్ మంజూరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha