Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేవదాయ ధర్మాదాయ చట్టంను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సి ఐ.

దేవదాయ ధర్మాదాయ చట్టంను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: సి ఐ.

వార్త 2 weeks ago

Srisailam Police: దేవదాయ ధర్మాదాయ చట్టంను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు:- సి ఐ. శ్రీశైలంకు వచ్చే వాహనాలు విస్తృత తనిఖీలు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ చట్టంను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని శ్రీశైలం ఒకటో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవన్ గంగనాద్ బాబు స్పష్టం చేశారు.

సోమవారం నాడు శ్రీశైలం కు చేరువలో ఉన్న ముఖ ద్వారం వద్ద వాహనాలను విస్తృత సోదాలను తమ సిబ్బందితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం మహా పుణ్యక్షేత్రాన్ని పవిత్ర పుణ్యక్షేత్రముగా ప్రతి ఒక్క భక్తుడు పాటించాలని తెలిపారు.

Read Also :Vizianagaram: విజయనగరం జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు.. ఢిల్లీలో పురస్కారం అందుకున్న DRP!

Srisailam Police: మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని పునీతులవ్వాలని పేర్కొన్నారు. నిషేధిత పదార్థాలైన మద్యం, మాంసం, సిగరెట్, సారా,గుట్కాలు తదితర వంటి వాటిని భక్తులు వాహనాల్లో తీసుకొని రాకూడదని కోరారు. నిషేధిత వస్తువులతో ఎవరైనా శ్రీశైలం క్షేత్రంలోకి వస్తే అట్టి వారిపై చట్టపరమైన,కఠినమైన చర్యలకు కూడా ఉపేక్షించేందుకు వెనుకాడమని తెలిపారు. క్షేత్ర పవిత్రతను కాపాడేందుకు తమ సిబ్బంది నిరంతరము పనిచేయడం జరుగుతుందని అన్నారు. నాటి కంటే నేడు మిన్నగా అన్ని వాహనాలను తమ సిబ్బంది సోదాలు చేసిన తర్వాతనే వాహనాలను లోపలికి అనుమతించడం జరుగుతుందని చెప్పారు. భక్తులు తెలియక ఏమైనా నిషేధిత పదార్థాలను తీసుకొని వస్తే తనిఖీల సమయంలో అక్కడి వారి చేతనే తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.కాగా భక్తులు, స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధిత పదార్థాలను తీసుకురాకుండా పోలీసులకు సహకరించాలని వారు కోరారు.

పులివెందులలో రెండ్రోజుల పాటు జగన్ పర్యటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha