Vizianagaram: న్యూఢిల్లీలో డీఆర్‌పీ శ్రీనివాసరావుకు అవార్డు అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం (PMFME)ను సమర్థవంతంగా అమలు చేస్తూ గణనీయమైన ప్రగతి సాధించినందుకు జిల్లా యంత్రాంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఆహార శుద్ధి రంగాన్ని మరింత విస్తరించడంతో పాటు సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం ఎఫ్‌ఎంఈ పథకంలో విశేష కృషి చేసిన డీఆర్‌పీ (District Resource Person) నెయ్యి గాపుల శ్రీనివాసరావు విజయనగరం జిల్లా నుంచి జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనను సన్మానించి అవార్డు అందజేశారు.
Vizianagaram: 100% లక్ష్య సాధనతో అవార్డు!
గత సంవత్సరం పీఎం ఎఫ్‌ఎంఈ పథకం అమలులో 100 శాతం ఫలితాలు సాధించడం ద్వారా విజయనగరం జిల్లా ఈ జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకోవడం విశేషమని జిల్లా కలెక్టర్ అన్నారు. సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమంలో
అవార్డుకు ఎంపికైన శ్రీనివాసరావును జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అభినందించారు. పీఎం ఎఫ్‌ఎంఈ పథకం ద్వారా జిల్లాలోని సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మరింత ప్రోత్సాహం కల్పించి, రైతులు, మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి కె. చిట్టిబాబు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం, ఉద్యానశాఖ అధికారులు, డీఆర్‌పీల సమన్వయంతో పథకం అమలులో సాధించిన ప్రగతికి ఈ అవార్డు గుర్తింపుగా నిలిచిందని అధికారులు జిల్లా కలెక్టర్ వారికి వివరించారు .
విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

