Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేవగిరి ఎక్స్ ప్రెస్ లో రూ. కోటి 22 లక్షల నగదు సీజ్

దేవగిరి ఎక్స్ ప్రెస్ లో రూ. కోటి 22 లక్షల నగదు సీజ్

వార్త 2 weeks ago

ఆపరేషన్ సతర్క్- నార్కోస్లో ఆర్పీఎఫ్ ఘన విజయం

Devagiri Express cash seized: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలటో భారీగా హవాలా నగదు పట్టుబడింది.

ముంబై నుంచి సికింద్రాబాద్కు అక్రమంగా తరలిస్తున్న కోటి 22 లక్షల 70 వేల నగదును రైల్వే జీఆర్పి, ఆర్పీఎప్ సిబ్బంది కలిలి పట్టుకున్నారు. మే 26న ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ రైలులో.. బోల్లారం, మల్కాజిగిరి రైల్వే స్టేషన్ల మధ్య తనిఖీ చేపట్టారు అధికారులు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) ఆపరేషన్ సతర్క్, ఆపరేషన్ నార్కోస్ట్ కింద చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో విశేష ఫలితాలు సాధించింది. మే 25, 26 తేదీల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్లలో భారీ మొత్తంలో అక్రమ నగదు, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులను అదుపులోకి తీసుకుంది.

Read Also : ED Raids Pinarayi Vijayan: పినరయి విజయన్‌పై ఈడీ దాడులు.. కేంద్రంపై భగ్గుమన్న విపక్ష కూటమి!

 Rs. 1 crore 22 lakh cash seized in Devagiri Express

Devagiri Express cash seized: అక్రమ నగదు స్వాధీనం.. సీపీడీఎస్ అధికారుల తనిఖీలు

ఆపరేషన్ సతర్లో భాగంగా హైదరాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు నం. 17057 దేవగిరి ఎక్స్ ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేశారు. క్లెయిమ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ స్క్వాడ్ (సీపీడీఎస్) అధికారులు అతని ప్రవర్తనలో అసాధారణతను గమనించి తనిఖీలు నిర్వహించగా, రెండు సంచుల్లో రూ.1,22,70,000 విలువైన లెక్కచూపని నగదు లభ్యమైంది. ప్రాథమిక విచారణలో ఈ నగదును ముంబై జవేరీ బజార్ నుంచి సికింద్రాబాద్కు తరలిస్తున్నట్లు గుర్తించారు.
అనంతరం నగదు, అనుమానితుడిని తదుపరి విచారణ నిమిత్తం జీఆర్పీకి అప్పగించారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఐసీజేఎస్, ఆర్పీఎఫ్ సైబర్ సెల్ ద్వారా డిజిటల్ విశ్లేషణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

నాగావళి ఎక్స్ప్రెస్ లో నిఘా

ఇక ఆపరేషన్ నార్కోస్ట్లో భాగంగా హైదరాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. రైలు నం.20809 నాగావళి ఎక్స్ప్రెస్లో సాధారణ నిఘా తనిఖీల సమయంలో ఓ ప్రయాణికుడి అనుమానాస్పద ప్రవర్తనను గమనించిన సీపీడీఎస్ బృందం తనిఖీలు చేపట్టింది. ప్రారంభంలో వ్యక్తిగత తనిఖీగా ప్రారంభమైన ఈ చర్య, భారీ అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా బట్టబయలు అయ్యింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha