Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!

వార్త 2 weeks ago

Karnataka politics: కర్ణాటక రాజకీయాల్లో గురువారం ఉదయం పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య అధికారికంగా ప్రకటించారు.

బెంగళూరులోని తన అధికారిక నివాసం 'కావేరి'లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అల్పాహార విందు (Breakfast Meeting) వేదికగా ఆయన ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించారు. గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత అధికార మార్పిడి ఉత్కంఠకు ఈ ప్రకటనతో తెరపడింది.

Read Also: Karnataka Politics: కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం.. కొత్త సీఎం పై ఉత్కంఠ

Karnataka politics

హైకమాండ్ ఆదేశాల మేరకే నిర్ణయం

కాంగ్రెస్ అధిష్టానం (హైకమాండ్) సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య తన సహచర మంత్రులకు స్పష్టం చేశారు. పార్టీ అధినాయకత్వానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన మూడేళ్ల పాలనలో సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, సిద్ధరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం గమనార్హం. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ రాంచంద్ గెహ్లాట్ కార్యాలయానికి పంపించారు. ప్రస్తుతం గవర్నర్ ఇండోర్ పర్యటనలో ఉన్నప్పటికీ, షెడ్యూల్ ప్రకారమే రాజీనామా ప్రక్రియ ముగిసింది. సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు 100% ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే, సిద్ధరామయ్య వర్గం సీనియర్ దళిత నాయకుడు, హోం మంత్రి జి. పరమేశ్వర పేరును కూడా పరిశీలించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే జరగబోయే కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP) సమావేశంలో కొత్త సీఎం ఎవరనేది అధికారికంగా ఖరారు కానుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సిద్దరామయ్య రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha