గురువారం పాలేరులో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
Khammam News: తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం భారీ వ్యయం చేస్తోంది.
ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇప్పటికే ₹22 వేల కోట్లు కేటాయించింది. రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన ₹500 బోనస్ కూడా అందుతుందని మంత్రులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తయింది. సుమారు ₹4,800 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.
Read also: DOST 2026: తెలంగాణ దోస్త్ తొలి విడత ఫలితాలు విడుదల
Paddy procurement review meet Khammam
Khammam News: తరుగు పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బంది పెట్టే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. క్వింటాల్‌కు 5 నుండి 6 కిలోల వరకు తరుగు తీస్తున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల అతిక్రమించి రైతులను మోసం చేసే రైస్ మిల్లులను వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. క్లీన్ చేసిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులను కోరారు. తాలు, తరుగు లేకుండా పారదర్శకమైన కొనుగోళ్లే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
రవాణా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లు
ఎండల తీవ్రత, కూలీల కొరత ఉన్నప్పటికీ ధాన్యం తరలింపు ఆగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే 15 రోజుల పాటు లారీలు, డీసీఎం వాహనాలను కేవలం ధాన్యం రవాణాకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇసుక, సిమెంట్ వంటి ఇతర రవాణాను తాత్కాలికంగా నియంత్రించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. అదనపు గోదాముల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ధాన్యం సేకరణ వేగవంతం చేస్తూ రైతులకు రెండు రోజుల్లోనే చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీ చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
పీజేటీఏయూలో భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభం

