DOST 2026: 'దోస్త్' సీట్ల కేటాయింపు తొలి విడతలో 56,147 మంది ఎంపిక కామర్స్లో అత్యధికంగా 23,214 మందికి సీట్లు రెండో విడతకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి,డిగ్రీ మొదటి సంవత్సరం లో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్)- 2026 మొదటి విడతలో 56,147 మందికి సీట్ల కేటాయింపు చేశారు.
వారిలో కామర్స్ విద్యార్థులు అత్యధికంగా 23,214 మంది ఉన్నారు. మొత్తం సీట్ల కేటాయింపులో కామర్స్ విద్యార్థులు 45 శాతానికి పైగా ఉన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 23 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దోస్త్-2026 మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి గురువారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేశారు.
Read also: Telangana Farmers: దయనీయంగా తెలంగాణ రైతుల పరిస్థితి.. మహేశ్వర్ రెడ్డి
DOST 2026 Degree Admission Updates
DOST 2026: సీటు వచ్చిన వారు వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొఫెసర్ ఎస్కె మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, దోస్త్ అధికారులు వసుంధర విజయరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన దోస్త్ ఛైర్మెన్, కళాశాల విద్య కమిషనర్ తోపాటు కళాశాల విద్య జాయింట్ డైరక్టర్లు ఇతర సీసీఈ ఉన్నతాధికారులు ఎవరూ హాజరు కాలేదు. మొదటి విడత సీట్ల కేటాయింపు సందర్భంగా దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. 84,610 మంది విద్యార్థులు దోస్తో దరఖాస్తు చేసుకున్నరని తెలిపారు. వారిలో ఫేజ్-1లో 61,543 మంది వెబ్ ఆప్షన్లను ఇవ్వగా.. అందులో 56,147 మందికి మొదటి విడతలో సీట్ల కేటాయింపు చేసినట్టు తెలిపారు. వెబ్ ఆప్షన్లు తక్కువగా ఇచ్చిన విద్యార్థుల్లో 5396 మందికి మొదటి విడతలో సీట్లు కేటాయించలేదన్నారు.
నేటి నుంచే రెండో విడత రిజిస్ట్రేషన్ల ప్రారంభం
మొదటి ఆప్షన్ ఇచ్చిన వారిలో 36,634 మందికి సెకండ్ ఆప్షన్ ఇచ్చిన 19,513 మందికి సీట్ల కేటాయింపు చేశారు. సీట్లు కేటాయింపులో.. ఆర్ట్స్ 8,415 మందికి, కామర్స్ లో 23,214 మందికి, లైఫ్ సైన్సెస్లో 9,815 మందికి ఫిజికల్ సైన్సెస్లో 14,394 మందితోపాటు ఇతరులు 309 మందికి సీట్లు కేటాయించారు. ఇంగ్లీష్ మీడియంలో 54,608 మందికి, తెలుగు మీడియంలో 1,131 మందికి హిందీ మీడియంలో ఏడుగురికి, ఉర్దూ మీడియంలో 396 మందికి, అరబిక్ మీడియంలో ఐదుగురికి సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన వారిలో 36,302 మంది బాలికలు ఉండగా, 19,845 మంది బాలురున్నారు. రాష్ట్రంలోని 777 డిగ్రీ కాలేజీల్లో 3,60,709 సీట్లు అందుబాటులో ఉండగా వాటిలో 56,147 సీట్లను కేటాయించారు.
ఈ నెల 23 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి
రాష్ట్ర వ్యాప్తంగా 79 కాలేజీలకు మొదటి విడతలో సీట్లను కేటాయించలేదన్నారు. గురుకులాల అధ్వర్యంలో కొనసాగుతున్న 79 కాలేజీలతోపాటు, నాన్ దోస్త్ ఉన్న 60 కాలేజీల్లోనూ దోస్త్ ద్వారా ప్రవేశాలను జరపడం లేదని తెలిపారు. మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు రూ.500, రూ.1000 చెల్లించి నేటి(శుక్రవారం) నుంచి ఈ నెల 23 వరకు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందని దోస్త్ కన్వీనర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్కి అర్హులుగా ఉన్నవారు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సమయంలో ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదని బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు రెండో విడతలో రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్టు తెలిపారు.
రెండో విడత సీట్ల కేటాయింపు ఈ నెల 30న చేపడతామని తెలిపారు. ఏఐఈడీపీ కోర్సులను అందిస్తున్న ప్రభుత్వ కాలేజీల్లో 11,580 సీట్లు ఉండగా వాటిలో 1379 మందికి సీట్ల కేటాయింపు చేసినట్టు తెలిపారు. మొత్తం సీట్లలో 11.91 శాతం సీట్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రైవేటు కాలేజీల్లో 26,100 సీట్లు ఉండగా వాటిలో 2118 మందికి సీట్లు కేటాయించారు. 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో 290 సీట్లు ఉండగా అందులో 263 సీట్లను కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ప్రవేశ పెట్టిన కోర్సుల్లో సీట్ల కేటాయింపును రెండో విడతలో చేపట్టనున్నట్టు తెలిపారు. అటానమస్ కాకుండా కొనసాగుతున్న 116 ప్రభుత్వడిగ్రీ కాలేజీల్లో 50,760 సీట్లు ఉండగా.. మొదటి విడతలో 8079 సీట్లను కేటాయించారు. 577 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2,37,540 సీట్లు ఉండగా.. అందులో 16,633 సీట్లను కేటాయించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో భారత్-ఆస్ట్రేలియా స్మార్ట్ ఫార్మ్ నెట్వర్క్ ప్రారంభం

