Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం తడిసినా కొనాల్సిందే..అధికారులకు ఉత్తమ్ ఆదేశాలు

ధాన్యం తడిసినా కొనాల్సిందే..అధికారులకు ఉత్తమ్ ఆదేశాలు

వార్త 3 months ago

తెలంగాణలో యాసంగి (రబీ) సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, ఈ మే నెలాఖరు నాటికే సంపూర్ణంగా ముగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు 51 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని, ఇందుకు సంబంధించిన నిధులను కూడా రైతుల ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు జమ చేశామని ఆయన వెల్లడించారు. కొనుగోళ్లకు అత్యంత కీలకమైన గన్నీ బ్యాగుల (సంచుల) కొరత ఎక్కడా లేదని, దాదాపు 21 కోట్ల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజనూ సేకరించి, వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Read Also ; చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో మధురం.. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపైకి చేరిన బాల్య మిత్రులు!

 Gas Price

తడిసిన ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాల వల్ల అన్నదాతలు నష్టపోకుండా ఉండేందుకు మంత్రి ఉత్తమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసినప్పటికీ, నిబంధనలను సడలించి అధికారులు ఆ ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు, మిల్లుల యజమానులు తాలు, తరుగు (తేమ శాతం, పొట్టు) పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఏ రూపంలో మోసం చేసినా సదరు అధికారులపై, ఐకేపీ (IKP) కేంద్రాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాలని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మొక్కజొన్న కొనుగోళ్లు షురూ.. భారీ నిధులు కేటాయించిన ప్రభుత్వం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha