Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొక్కజొన్న కొనుగోళ్లు షురూ.. భారీ నిధులు కేటాయించిన ప్రభుత్వం!

మొక్కజొన్న కొనుగోళ్లు షురూ.. భారీ నిధులు కేటాయించిన ప్రభుత్వం!

వార్త 3 months ago

Minister Tummala Nageswara Rao: తెలంగాణలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తోంది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, ఈసారి భారీ దిగుబడులు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. గతంలో కేటాయించిన నాలుగు వేల కోట్లకు అదనంగా మరో వెయ్యి ఎనిమిది వందల కోట్లు మంజూరు చేయడం జరిగింది. సీఎం ఆదేశాల మేరకు ఈ నిధులను కేటాయించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read also: Summer Holidays 2026: మే 31తో ముగియనున్న వేసవి సెలవులు!

 Maize procurement in Telangana state

జొన్న, పొద్దుతిరుగుడు పంటల సేకరణ

మొక్కజొన్నతో పాటు ఇతర పంటల విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. ముఖ్యంగా జొన్న పంట కొనుగోళ్లకు పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించి సేకరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే పొద్దుతిరుగుడు సాగు చేసిన రైతుల కోసం దిగుబడిలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ కొనుగోలు చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు సేకరించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంతం రంగంలోకి దిగింది.

Minister Tummala Nageswara Rao: రైతులకు అందుబాటులో కొనుగోలు కేంద్రాలు

రాష్ట్రవ్యాప్తంగా పంటల సేకరణ పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఆందోళన చెందకుండా దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాలను ఆశ్రయించాలి. ప్రభుత్వం కల్పించే ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. నిధుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు.. రైతులకు భారీ మినహాయింపు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha