Madhya Pradesh Car Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ధార్ జిల్లాలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో కారులో మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో వ్యక్తి తీవ్ర కాలిన గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ధార్ జిల్లాలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
Edulabad Farmhouse Death: ఫామ్‌హౌస్‌లో రిటైర్డ్ ఎస్‌ఐ కొడుకు అనుమానాస్పద మృతి!
Madhya Pradesh Car Accident: ఆసుపత్రిలో బాధితుడికి చికిత్స

ఈ ప్రమాదంలో మరో వ్యక్తి 35 నుంచి 40 శాతం కాలిన గాయాలతో బయటపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఇండోర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కారు అదుపుతప్పడానికి గల కారణాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Epaper: epaper.vaartha.com

